Manthena Health Tip: మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఇది ఒక్కటి తినండి

Published : Mar 13, 2026, 06:16 PM IST

Manthena Health Tip: ఉదయం లేవగానే మలవిసర్జన సరిగా జరగకపోతే రోజంతా అసౌకర్యంగా అనిపిస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, చికాకుగా ఉంటుంది. చిన్న మార్పులతో మలబద్ధకం సమస్యను దూరం చేయోచ్చని చెబుతున్నారు. 

PREV
15
మంతెన గారి సూచన

మోషన్ ఫ్రీగా అయితేనే డే మొత్తం యాక్టివ్‍గా ఉంటారు. ఏ పనైనా హుషారుగా చేస్తారు. ఎనర్జిట్‍గా అనిపిస్తుంది. లేదంటే చికాకు, అలసట, ఆకలి లేకపోవడం, బద్ధకంగా ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం, నీళ్లు తక్కువగా తాగడం, కూరగాయలు తినకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఆహారంలో ఈ చిన్న మార్పులు చేస్తే మలబద్ధకాన్ని తగ్గించవచ్చని ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ గారు చెబుతున్నారు.

ఆహారమే ఔషధం, మలబద్ధకానికి బెస్ట్ మెడిసిన్ బీరకాయ అని మంతెన సూచిస్తున్నారు. ఈ బీరకాయతో జాడించి మోషన్ అయిపోతుందంట. మరి దీని ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలో ఆయన సూచనల ద్వారా తెలుసుకుందాం.

25
బీరకాయ చాలా తేలికగా జీర్ణమయ్యే కూరగాయ

ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది. బీరకాయలో ఉండే ఫైబర్ మల విసర్జనను సులభం చేస్తుంది. కడుపులో పేరుకున్న వ్యర్థాలు బయటకు వెళ్లేందుకు ఇది సహాయపడుతుంది. అందుకే మలబద్ధం సమస్య ఉన్నవారికి బీరకాయను తరచూ తినాలని సూచిస్తారు. 

35
బీరకాయలో ఉండే పోషకాలు

బీరకాయలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి.

ఫైబర్-జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

విటమిన్C- రోగనిరోధక శక్తిని పెంచుతుంది

విటమిన్ A- చర్మం, కళ్ల ఆరోగ్యానికి మంచిది

నీరు అధికంగా-శరీరాన్ని హైడ్రేట్‍గా ఉంచుతుంది

ఈ పోషకాలు శరీరాన్ని తేలికగా ఉంచడంలో, జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి.

45
ఎలా తింటే మంచిది?

బీరకాయను ఆహారంలో చేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.బీరకాయను పప్పులో వేసుకుని తినవచ్చు. తక్కువ నూనెతో కూరగా చేసుకోవచ్చు. చట్నీగా చేసుకుని తినవచ్చు. కొంతమంది సూప్ రూపంలో కూడా తీసుకుంటారు.

వారంలో కనీసం రెండు, మూడు సార్లు బీరకాయను ఆహారంలో చేర్చుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

55
ఇతర అలవాట్లు కూడా అవసరం

బీరకాయతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లు, ఆకుకూరలు, మొలకలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే రోజూ సరిపడా నీళ్లు తాగడం, కొంతసేపు నడక లేదా వ్యాయామం చేయడం కూడా జీర్ణవ్యవస్థకు ఎంతో ఉపయోగకరం.

Read more Photos on
click me!

Recommended Stories