అధిక రక్తపోటు, డయాబెటిస్, అనారోగ్యకరమైన ఆహారం, నిశ్చల జీవనశైలి, మద్యపానం, ధూమపానం, ఊబకాయం మొదలైనవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లను పాటిస్తే గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నవారికి నట్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.