పచ్చి ఉల్లిపాయలను తింటే..!

Published : Jun 13, 2023, 03:03 PM IST

ప్రతి వంటగదిలో ఉల్లిపాయలు ఖచ్చితంగా ఉంటాయి. ఉల్లిపాయను ప్రతి కూరగాయలో వేస్తుంటారు. నిజానికి ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  

PREV
16
పచ్చి ఉల్లిపాయలను తింటే..!
Image: Getty Images

ఉల్లిపాయ లేని కూరలు టేస్టీగా ఉండవని చాలా మంది అంటుంటారు. అది నిజమే. నిజానికి ఉల్లిపాయలు కూరలను టేస్టీగా చేస్తాయి. అలాగే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అందులోనూ పచ్చి ఉల్లిపాయలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలుగుతాయి. అవేంటంటే.. 
 

26

విటమిన్ సి

పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

చెడు కొలెస్ట్రాల్

ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. పచ్చి ఉల్లిపాయలను తింటే అధిక రక్తపోటు తగ్గుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. 
 

36

జీర్ణక్రియ

ఉల్లిపాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది.

ఎముకల ఆరోగ్యం

పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పచ్చి ఉల్లిపాయలను తింటే ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
 

46

కొన్ని క్యాన్సర్లు

ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా నివారిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కంటి ఆరోగ్యం

పచ్చి ఉల్లిపాయల్లో ఉండే సెలీనియం మన శరీరంలో విటమిన్ ఇ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో సహాయపడుతుంది.
 

 

56

చర్మంపై ముడతలు

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఉల్లిపాయలు చర్మంపై ముడతలు, నల్ల మచ్చలను నివారించడానికి, చర్మం మెరిసేలా చేయడానికి ఎంతో సహాయపడుతుంది.

డయాబెటీస్

పచ్చి ఉల్లిపాయలు మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పచ్చి ఉల్లిపాయలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఇవి సహాయపడతాయి.
 

66

బరువు తగ్గడానికి

ఉల్లిపాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మొత్తంగా బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి.  

Read more Photos on
click me!

Recommended Stories