పాదాల పగుళ్ళతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలను ప్రయత్నించండి!

Published : Jul 04, 2022, 03:56 PM IST

పాదాల పగుళ్లు (Cracked feet) ఏర్పడినప్పుడు వాటి నివారణ కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం రకరకాల క్రీమ్స్, లోషన్స్ లను వాడుతుంటారు.  

PREV
16
పాదాల పగుళ్ళతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలను ప్రయత్నించండి!

వీటి వాడకంతో తాత్కాలిక ఉపశమనం (Temporary relief) లభించిన తిరిగి పాదాల పగుళ్ల సమస్య ఏర్పడుతుంది.  కనుక సహజ సిద్ధమైన పద్ధతిలో పాదాల పగుళ్లను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తే శాశ్వతంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఇందుకోసం పాటించవలసిన చిట్కా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

26

నలుగురిలో అందంగా కనిపించాలంటే ముఖ సౌందర్యంతో పాటు పాదాల సౌందర్యం (Beauty of feet) కూడా ముఖ్యమే. కానీ చాలామంది పాదాల సౌందర్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ సౌందర్యంపై చూపించే శ్రద్ధను పాదాలపై చూపించరు. దీంతో పాదాలు దగ్గర ఉండే చర్మ కణాలలో మురికి పేరుకుపోయి పాదాల సమస్యలు (Foot problems) కలుగుతాయి. కానీ ఈ సమస్యను చిన్నదిగా భావించి నిర్లక్ష్యం చేస్తే దీని తీవ్రత అధికమవుతుంది.
 

36

పాదాలలో పేరుకుపోయిన మురికి ఎక్కువ రోజులు ఉండేసరికి అక్కడి చర్మం గట్టిపడి పగుళ్లకు దారితీస్తుంది. పాదాల పగుళ్లు ఏర్పడినప్పుడు పగుళ్ల నుంచి రక్తం కారడం (Bleeding), నడుస్తుంటే నొప్పి (Pain) అనిపించడం వంటి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. కనుక ఈ సమస్యను తగ్గించుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఇలా ఏర్పడ్డ పాదాల పగుళ్లు కారణంగా పాదాలు అందవిహీనంగా కనిపిస్తాయి.
 

46

కనుక పాదాలు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే కొన్ని సహజ సిద్ధమైన పద్ధతులను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. వీటి ఉపయోగంతో పాదాల సమస్య తగ్గడంతో పాటు పాదాలు అందంగా, కోమలంగా, మృదువుగా మారుతాయి. ఇందుకోసం పాదాలకు కొబ్బరి నూనె (coconut oil) లేదా ఆముదాన్ని (Castor oil) రాసుకుని వేడి నీటిలో పాదాలను పెట్టేసి అరగంట పాటు అలాగే కూర్చోవాలి.
 

56

పాదాలకు కొబ్బరి నూనె రాయడంతో పాదాల దగ్గర చర్మం మెత్తబడుతుంది. అలాగే వేడి నీటిలో (Hot water) ఉంచడంతో పాదాలు నానుతాయి. అరగంట తరువాత నీటిలో నుంచి పాదాలను తీసి మెత్తటి బ్రష్ తో పాదాలను సున్నితంగా రుద్దుతూ శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే చర్మ కణాలలో పేరుకుపోయిన మురికి తొలగిపోయి పాదాలు శుభ్రపడతాయి. దీంతో గట్టిపడిన చర్మం పోయి కొత్త చర్మం (New skin) వస్తుంది.
 

66

పాదాలను శుభ్రపరచుకున్నాక కాటన్ వస్త్రంతో తడి లేకుండా తుడుచుకొని తిరిగి మరోసారి పాదాలకు కొబ్బరి నూనెను లేదా నెయ్యిని (Ghee) రాసుకోవాలి. ఇలా చేస్తే పాదాలు మృదువుగా, కోమలంగా మారుతాయి. ఇలా రోజులో ఒకసారి ప్రయత్నించండి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేస్తే ఎటువంటి ఆర్టిఫిషియల్ క్రీమ్స్ (Artificial creams) ను వాడకుండా సహజసిద్ధమైన పద్ధతిలో పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు. కనుక పాదాల పగుళ్ల సమస్యతో బాధపడేవారు ఈ చిట్కాను ప్రయత్నిస్తే పాదాల సమస్యలు తగ్గడంతో పాదాల అందం పెరుగుతుంది.

click me!

Recommended Stories