రెస్టారెంట్ స్టైల్ మొక్కజొన్న మసాలా కూర ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది!

Published : Jul 04, 2022, 03:19 PM IST

మొక్కజొన్నకు (Corn) ఉప్పు, కారం, నిమ్మరసం అప్లై చేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. అలాగే మొక్కజొన్నతో తయారు చేసుకునే వంటలు కూడా భలే రుచిగా ఉంటాయి.  

PREV
17
రెస్టారెంట్ స్టైల్ మొక్కజొన్న మసాలా కూర ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది!

రెస్టారెంట్ స్టైల్ లో మొక్కజొన్న, జీడిపప్పు కాంబినేషన్ తో చేసుకునే మసాలా కూర రుచి మరి అద్భుతంగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ లో ఈ రెసిపీని ఎంతో సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం మొక్కజొన్న మసాలా కూర (Corn masala curry) తయారీ విధానం గురించి  తెలుసుకుందాం..
 

27

కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు (Corn kernels), ఒక ఉల్లిపాయ (Onion), మూడు టమోటాలు (Tomatoes), రెండు పచ్చిమిరపకాయలు (Green chilies), సగం స్పూన్ వెల్లుల్లి (Garlic) తరపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), సగం స్పూన్ జీలకర్ర (Cumin), పదిహేను జీడిపప్పు (Cashew) పలుకులు, సగం స్పూన్ పసుపు (Turmeric).
 

37

రుచికి సరిపడా ఉప్పు (Salt), ఒక స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ (Kashmiri Chilli Powder), ఒక స్పూన్ ధనియాల పొడి (Coriander powder), ఒక స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), సగం స్పూన్ గరం మసాలా (Garam masala), సగం స్పూన్ కసూరి మేథి (Kasuri methi), ఒక స్పూన్ బటర్ (Butter), ఒక స్పూన్ క్రీం (Cream), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, నాలుగు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
 

47

తయారీ విధానం: ముందుగా అరగంట పాటు జీడిపప్పు పలుకులను నీళ్లలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న జీడిపప్పును (Soaked cashews) పది నిమిషాల పాటు ఉడికించుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, వెల్లుల్లి తరుగు వేసి వేగిన తరువాత ఉల్లిపాయ తరుగు వేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై (Fry) చేసుకోవాలి.
 

57

ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ చిలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, పసుపు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమోటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు (Salt) వేసి బాగా కలుపుకొని (Mix well) మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టమోటాలు బాగా మగ్గిన తరువాత ముందుగా పేస్ట్ చేసుకున్న జీడిపప్పు మిశ్రమం, ధనియాల పొడి, కసూరి మేథి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
 

67

తరువాత సగం కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని మిశ్రమం చిక్కగా తయారయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె, బటర్ (Butter) వేసి వేడెక్కిన తరువాత ఉడికించుకున్న మొక్కజొన్న గింజలను (Boiled corn kernels) వేసి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మొక్కజొన్న గింజలను ముందుగా తయారు చేసుకున్న మసాలా మిశ్రమంలో వేసి కలుపుకొని ఉడికించుకోవాలి.
 

77

తక్కువ మంట (Low flame) మీద మూత పెట్టి కూర నుంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చివరిలో కొత్తిమీర తరుగు, గరం మసాలా, క్రీం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) రెస్టారెంట్ స్టైల్ మొక్కజొన్న మసాలా కూర రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీ కుటుంబ సభ్యులకు తప్పక నచ్చుతుంది. 

click me!

Recommended Stories