అవొకాడోతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో మీకు తెలుసా?

First Published Dec 9, 2021, 4:51 PM IST

అవొకాడో (Avocado) ఒక మంచి హెల్తీ ఫ్రూట్. నిత్యం  అవొకాడోను తీసుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవొకాడోలో ఉండే పోషకాలు శరీరానికి కావాల్సిన పోషకాలను సమృద్ధిగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. శరీరంలోని అనేక వ్యాధులను నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ (Article) ద్వారా అవొకాడో తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.. 
 

అవొకాడోలో ఎ, బి,ఈ విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు ఉంటాయి. శరీరంలోని కొన్ని వ్యాధులను (Diseases) నయం చేసే గుణాలు కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ క్యాలరీలను (Calories) కలిగి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. అవొకాడోను నిత్యం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఎక్కువగా మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్ లలో వాడతారు. అయితే ఇప్పుడు అవొకాడో ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. 
 

గుండె సమస్యలను తగ్గిస్తుంది: గుండె పనితీరును మెరుగుపరచడానికి అవొకాడో చక్కగా పనిచేస్తుంది. అవొకాడోలో B6, ఫోలిక్ ఆమ్లం (Folic acid) సమృద్ధిగా ఉంటాయి. ఇది గుండె సంబంధిత వ్యాధులను (Cardiovascular diseases) నయం చేయడానికి సహాయపడుతాయి. ఇందులో అధిక మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండడంతో గుండె స్ట్రోక్స్ లను నివారిస్తుంది.
 

బరువును పెంచుతుంది: అవొకాడోలో కేలరీలు (Calories), ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు (Fatty substances), పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి బరువు పెరగాలనుకొనే వారికోసం సహాయపడతాయి. 100 గ్రామూల అవెకాడో సుమారు 60-80 కేలరీలను కలిగి ఉంటుంది. ఈ పోషకాలు శరీర బరువును ఆరోగ్యకరమైన పద్దతిలో పెంచుటకు సహాయపడతాయి.  

చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది: పొడిబారిన చర్మానికి తగినంత తేమను అందించి చర్మం ప్రకాశవంతంగా, కాంతివంతంగా మారేందుకు సహాయపడుతుంది. చర్మంపై పేరుకున్న వ్యర్థాలను బయటకు పంపించి చర్మాన్ని తాజాగా మారుస్తుంది. చర్మ సమస్యలను (Skin problems) దరిచేరనివ్వదు. చర్మ సౌందర్యం కోసం అవొకాడో నూనెను (Avocado oil) ఉపయోగించడం మంచిది.
 

ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది: అవోకాడో యాంటీ శోథలక్షణాలను కలిగి ఉంటుంది. అవోకాడోలో కొవ్వులు, విటమిన్లు, ఇనుము,  పొటాషియం (Potassium) వంటి ఖనిజాలు ఉండుటవల్ల నొప్పి స్వస్థత లక్షణాలు కలిగి ఉంటుంది.  ఇవి కీళ్లనొప్పి (Arthritis) కారణంగా వచ్చే జాయింట్ మంటలను, నొప్పి తగ్గించడానికి సహాయపడుతాయి. అవొకాడో నూనెను నొప్పి ఉన్న ప్రదేశంలో మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 

పైన తెలిపిన విధంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించడంతో పాటు కంటిచూపును (Eyesight) మెరుగు పరుస్తుంది. ఎముకల సామర్థ్యాన్ని బలపరచడానికి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. ఈ ఫ్రూట్ గర్భిణీలు తీసుకోవడంతో వారికి తగిన పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటారు. అరటి పండులో ఏ విధంగా అయితే పొటాషియం అధిక మొత్తంలో ఉంటుందో అవోకాడోలో కూడా పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. దీని ఖరీదు ఎక్కువే అయినా దీనితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) శరీరానికి మేలుచేస్తాయి.

click me!