కలయికతో షుగర్ వస్తుందా.. నిపుణులు ఏం చెప్తున్నారు.. పూర్తిగా తెలుసుకోండి!

First Published Dec 8, 2021, 4:34 PM IST

ప్రస్తుత కాలంలో జీవనశైలిలో మార్పులు, ఆహారపు పద్ధతిలో మార్పుల కారణంగా వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసు నుంచి పెద్దవాళ్ల వరకూ ఈ షుగర్ వ్యాధి (Diabetes) చాలా ఇబ్బందికి గురి చేస్తోంది. యుక్తవయసు వారిలో కూడా షుగర్ వ్యాధి ఉండడంతో వారిలో పలు సందేహాలకు దారితీస్తోంది. అయితే కలయికలో పాల్గొంటే షుగర్ వ్యాధి వస్తుందా అనే అనుమానాలు వారిలో తలెత్తుతున్నాయి. దీని గురించి సరైన అవగాహన కల్పించడం కోసం డాక్టర్ల సలహాలతో ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేయడం జరిగింది.
 

షుగర్ వ్యాధి శరీరతత్వాన్ని బట్టి, జన్యుపరమైన కారణాలు, జీవన విధానంలో మార్పులు ఇతర రకాలతో సంక్రమిస్తుంది. అయితే ఈ షుగర్ వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే అంటువ్యాధి (Infection) కాదు. కనుక భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి షుగర్ వ్యాధి ఉన్నా అది ఒకరి నుంచి మరొకరికి కలయిక ద్వారా సంక్రమించదు. మీరు ఎటువంటి అపోహలు (Myths) లేకుండా కలయికలో సంపూర్ణంగా పాల్గొనవచ్చును. మీరు కలయికను సంపూర్ణంగా ఆస్వాదించవచ్చు.
 

అయితే మీరు పిల్లలు కనాలని ప్లాన్ చేసుకున్నప్పుడు గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వారు మీ షుగర్ లెవెల్ ఎంత ఉందో దానికనుగుణంగా మీకు సరైన చికిత్స (Treatment) అందిస్తారు. అప్పుడు మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా గర్భం దాల్చవచ్చు. గర్భం దాల్చడానికి మీ శరీర ఆరోగ్యస్థితి అనుగుణంగా ఉండాలి. అప్పుడే తల్లీబిడ్డ క్షేమంగా ఉంటారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. గర్భానికి ప్రయత్నించే ముందు షుగర్ శాతం (Sugar percentage) అదుపులో ఉంచుకోవాలి.
 

దాని కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మన జీవన శైలిలో (Lifestyle), తీసుకునే ఆహారంలో మార్పులను అలవరుచుకోవాలి. అప్పుడే షుగర్ నియంత్రణలో ఉంటుంది. షుగర్ నియంత్రణలో లేకుండా గర్భం దాల్చడంతో అబార్షన్లు, బిడ్డలో అవయవాల లోపాలు, నెలలు నిండకుండా కాన్పు కావడం, ఉమ్ము నీరు అధికంగా ఉండడం, బిడ్డ బరువు సరిగా లేకపోవడం, కడుపులో బిడ్డ చనిపోవడం వంటి ఇబ్బందులు (Difficulties) ఎదురవుతాయి.
 

షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు సంతానం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మీ వయసుకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. వయస్సు 35 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అండాశయాలలో (Ovary) అండాలు ఉత్పత్తి అయ్యే సంఖ్య తగ్గుతుంది. దాంతో గర్భం దాల్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కనుక సరైన టైంలో సంతానం కోసం ప్లాన్ చేసుకోవడం మంచిది. వయసు 35 దాటితే గర్భాశయంలో సమస్యలు (Uterine problems), గర్భంలో బిడ్డ అవయవ లోపాలు, అబార్షన్లు, బీపీ పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
 

కనుక షుగర్ ను తొందరగా అదుపులోనికి తెచ్చుకోవడానికి పోలిక్ యాసిడ్ (Folic acid) మాత్రలు వాడుతూ గర్భం కోసం ప్రయత్నించడం మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. మీరు సంతానం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మూడు నుంచి ఆరు నెలల్లో గర్భం రాకపోతే గైనకాలజిస్ట్ (Gynecologist) ను సంప్రదించడం మంచిది. మీరు తొందరగా గర్భం దాల్చాక పోవడానికి గల కారణం ఏంటో తెలుసుకుని దానికి అనుగుణంగా చికిత్స ఇస్తారు.

click me!