కోడిగుడ్డుతో చర్మ సౌందర్యానికి కలిగే ప్రయోజనాలు మీకోసమే.. అవి ఏమిటంటే?

First Published Dec 9, 2021, 3:37 PM IST

చర్మ సౌందర్యం కోసం అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అందుకోసం ఎక్కువ మొత్తంలో ఆర్టిఫిషియల్ క్రీమ్  లను వాడుతుంటారు. కానీ ఇది తాత్కాలిక మెరుపును అందించి చర్మ సహజ సిద్ధమైన మృదుత్వానికి హాని కలిగిస్తాయి. చర్మ సౌందర్యం కోసం సహజ సిద్ధమైన పద్ధతులను ఉపయోగించడం మంచిదని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అధిక ప్రోటీనులు కలిగిన కోడిగుడ్డు (Egg) చర్మ సౌందర్యం (Skin beauty) కోసం ఉపయోగపడుతుందని వారు తెలియజేస్తున్నారు. నిత్యం మనం తీసుకునే ఆహారంలో కోడిగుడ్డు ఒక భాగంగా చేసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా కోడిగుడ్డు చర్మ సౌందర్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..      
 

కోడి గుడ్డులో చర్మ సౌందర్యానికి కావలసిన ప్రోటీన్లు (Proteins) అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి చర్మానికి కావలసిన తేమను అందించి చర్మం పొడిబారకుండా, నిర్జీవంగా మారకుండా చూస్తుంది. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కోడి గుడ్డులోని లూటిన్ (Lutein) మీ చర్మాన్ని ఎలాస్టిక్ గా చేయడానికి,  హైడ్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
 

ఇది చర్మంలో పేరుకుపోయిన మలిన పదార్థాలను (Impurities) శుద్ధి చేసి చర్మాన్ని గట్టిపడేలా చేస్తుంది. అందమైన చర్మ సౌందర్యం కోరుకునేవారు రోజు తీసుకునే ఆహారంలో (Food) కోడిగుడ్డును భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కోడి గుడ్డుతో చర్మ సౌందర్యం ఏవిధంగా మెరుగు పడుతుందో తెలుసుకుందాం.. 
 

మెరిసే చర్మ సౌందర్యం కోసం: కోడిగుడ్లును తీసుకొని అందులోని తెల్లసొనను (white yolk) ముఖానికి పట్టించి ఇది బాగా ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మన చర్మం బిగుతుగా మారి మంచి కాంతివంతమైన మెరుపును సొంతం చేసుకుంటుంది. ఇవి చర్మానికి మంచి స్క్రబ్ (Scrub) గా పనిచేస్తుంది. 
 

మొటిమలను తగ్గిస్తుంది: కోడిగుడ్డులోని తెల్లసొన మొటిమలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కోడిగుడ్డు తెల్లసొనను ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై ఏర్పడే మొటిమలు (Pimples) వాటి తాలూకు మచ్చలు (Spots) తొందరగా తగ్గుతాయి.
 

కళ్లకింద వాపులను తగ్గిస్తుంది: కంటి కింద చర్మం వాపు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. తెల్లసొనలో వాపులను తగ్గించగల సామర్థ్యం ఉంటుంది. తెల్లసొనను (white yolk) వాచిన ప్రదేశంలో అప్లై చేసుకొని పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడంతో కంటి కింద వాపు (Swelling under the eye) నుంచి తక్షణ విముక్తి కలుగుతుంది.  
 

ముఖం పై జిడ్డును తగ్గిస్తుంది: ఇందుకోసం ఒక కప్పు కోడిగుడ్డు తెల్లసొన (white yolk), కొంచెం కొబ్బరి నూనె (Coconut oil) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించి ఒక 15 నిముషాలు అలాగే ఉంచాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మం జిడ్డుని తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
 

అందమైన చర్మ సౌందర్యం కోసం: ఒక కప్పులో కోడిగుడ్డు తెల్లసొనను(white yolk) తీసుకుని అందులో ఒక స్పూన్ తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉండాలి. తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి.ఇది ముఖంపై ఏర్పడే మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. దాంతో అందమైన చర్మ సౌందర్యం మీ సొంతమౌతుంది.

click me!