గోంగూరతో నోరూరించే పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

Published : May 28, 2022, 01:12 PM IST

పులిహోర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే ఎప్పుడు చేసుకునే పులిహోరలకు బదులుగా ఈసారి గోంగూరతో పులిహోరని ట్రై చేయండి..  

PREV
18
గోంగూరతో నోరూరించే పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

ఈ పులిహోర పుల్ల పుల్లగా (Sour) భలే రుచిగా ఉంటుంది. అబ్బా చెబుతుంటే నోరూరుతుంది కదా.. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఈ గోంగూర పులిహోర (Gongura Pulihora) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

28

కావలసిన పదార్థాలు: ఒకటిన్నర కప్పుల బియ్యం (Rice), సగం స్పూన్ పసుపు (Turmeric ), రుచికి సరిపడా ఉప్పు (Salt), పావు కప్పు చింతపండు గుజ్జు (Tamarind pulp), ఒక కప్పు ఎర్ర గోంగూర (Red Gongura), పావు కప్పు నూనె (Oil).
 

38

పులిహోర పౌడర్ కోసం: ఒక టేబుల్ స్పూన్ మెంతులు (Fenugreek), ఒక టేబుల్ స్పూన్ ఆవాలు (Mustard), పది ఎండుమిరపకాయలు (Dried chillies), రెండు చిటికెళ్ల ఇంగువ (Asparagus), ఒక టీస్పూన్ నూనె (Oil).
 

48

తాలింపు కోసం: రెండు టేబుల్ స్పూన్ ల నూనె (Oil), పావు కప్పు వేరుశనగలు (Peanuts), ఒక టీస్పూన్ ఆవాలు (Mustard), ఒక టేబుల్ స్పూన్ సెనగపప్పు (Senagapappu), ఒక టీస్పూన్ మినప్పప్పు (Minappappu), రెండు ఎండు మిరపకాయలు (Dried chillies), రెండు రెబ్బల కరివేపాకులు (Curries), రెండు పచ్చిమిరపకాయలు (Chilies).
 

58

తయారీ విధానం: ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కడిగిన (Washed) బియ్యం, పావు టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ నూనె, నీళ్లు (Water) పోసి కుక్కర్ మూత పెట్టి అన్నాన్ని పొడి పొడిగా వండుకోని చల్లార్చుకోని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక టీస్పూన్ నూనె వేసి వేగిన తరువాత మెంతులు, ఆవాలు వేసి చిటపటలాడే వరకూ ఫ్రై చేసుకోవాలి.
 

68

ఇప్పుడు ఇందులో ఎండు మిరపకాయలను వేసి ఎర్రగా వేయించుకోవాలి. తరువాత ఇంగువ కూడ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పావు కప్పు నూనె, ఎర్ర గోంగూర, ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని (Mix well) ఫ్రై చేసుకొని చింతపండు గుజ్జు వేసుకోవాలి.
 

78

చింతపండు గుజ్జు (Tamarind pulp) నుంచి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై (Fry) చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతుల పొడిని వేసి బాగా కలుపుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరోసారి మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకొని ముందుగా తయారు చేసుకున్న అన్నంలోకి వేసి కలుపుకోవాలి.
 

88

ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడెక్కిన తరువాత వేరుశెనగలు, ఆవాలు, సెనగపప్పు, మినపప్పు వేసి ఎర్రగా వేపుకోని పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకులు, ఎండుమిరపకాయలను వేసి వేగిన తరువాత  కలుపుకున్న పులిహోర అన్నానికి తాలింపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) నోరూరించే గోంగూర పులిహోర రెడీ (Ready).

click me!

Recommended Stories