తెల్ల మిరియాల పొడి ఒక గ్లాస్ నీటిలో కలిపి తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా?

Published : May 28, 2022, 11:58 AM IST

ప్రస్తుతమున్న ఉరుకులు, పరుగుల జీవితంలో వయసు పైబడిన వారు మాత్రమే కాదు.. చిన్న వయసు వారు కూడా గుండె నొప్పితో బాధపడుతున్నారు.  

PREV
110
తెల్ల మిరియాల పొడి ఒక గ్లాస్ నీటిలో కలిపి తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా?

అలా వయసు తేడా లేకుండా బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.. దీంతో ప్రతి ఏటా గుండెపోటుతో (Heart attack) మరణించే (Dying) వారి సంఖ్య పెరిగిపోతోంది.. మరి ఈ సమస్యలను తగ్గించుకోవడానికి వేటిని తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

210

వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉంటూ శరీరానికి వ్యాయామం లేకపోవడం (Lack of exercise), తీసుకునే ఆహారంలో పోషకాహారలోపం (Malnutrition), జీవనశైలిలోని చెడు అలవాట్లు  గుండె సమస్యలకు, అధిక రక్తపోటు వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. ఇందుకోసం మన జీవనశైలిలో మంచి అలవాట్లను అలవాటు చేసుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం.. గుండె ఆరోగ్యం కోసం మనం తీసుకునే ఆహారం ప్రముఖ పాత్ర వహిస్తుంది.
 

310

కనుక తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇందుకోసం రోజువారీ ఆహార జీవనశైలిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అధిక కొవ్వు పదార్థాలకు (High fat contents) దూరంగా ఉంటూ మంచి బలమైన ఆహార పదార్థాలను తీసుకుంటే గుండె ఆరోగ్యంగా (Heart health) ఉండడంతోపాటు అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
 

410

ఉసిరికాయ పొడి, తేనె: ఉసిరికాయ (Amaranth), తేనె (Honey) రెండు పదార్థాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కనుక ప్రతిరోజూ ఉసిరికాయ పొడిలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకుంటే గుండె సమస్యలకు దూరంగా ఉండవచ్చు. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
 

510

వెల్లుల్లి: గుండె సమస్యలకు చక్కటి పరిష్కారం వెల్లుల్లి. వెల్లుల్లిలో (Garlic) ఔషధ గుణాలు (Medicinal properties) మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడుతాయి. కనుక ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనానికి ముందు నేతిలో వేయించిన వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే గుండె దృఢంగా మారుతుంది.
 

610

కుంకుమపువ్వు, నిమ్మరసం: గుండెను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచేందుకు కుంకుమపువ్వు (Saffron), నిమ్మరసం (Lemon juice) సహాయపడుతాయి. కనుక చిటికెడు కుంకుమ పువ్వును కొంచెం నిమ్మరసంలో కలిపి తీసుకుంటే గుండె సమస్యలు తగ్గి గుండె బలంగా ఉంటుంది.

710

చింతచిగురు: గుండెకు బలాన్ని (Strength to the heart) అందించడం కోసం చింతచిగురు (Chintachiguru) సహాయపడుతుంది. కనుక చింతచిగురును కూరల రూపంలో కానీ, పొడి రూపంలో కానీ ఇలా ఏదో ఒక విధంగా శరీరానికి అందించాలి. దీంతో గుండె ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది.
 

810

ఎండు అంజూరపు పండ్లు: ఎండు అంజూరపు (Dried figs) పండ్లు, జీలకర్రను (Cumin) సమపాళ్ళలో తీసుకొని పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక స్పూన్ తేనెతో (Honey) కలిపి ప్రతిరోజూ తీసుకోవాలి. ఇలా చేస్తే గుండె పోటు, గుండె నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
 

910

తెల్ల మిరియాల పొడి: ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ తెల్ల మిరియాల పొడిని (White pepper powder) కలుపుకుని ప్రతిరోజూ తాగితే గుండె సమస్యలు (Heart problems) దరిచేరవు. దీంతో గుండె ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. అలాగే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
 

1010

వీటితోపాటు మల్లె పువ్వుల టీ, ఎండు ద్రాక్ష,  ఆక్రూట్ (Walnut) పండ్లు, దానిమ్మ (Pomegranate) పండ్లను తీసుకుంటే గుండె ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. ఇటువంటి బలమైన ఆహార పదార్థాలను జీవనశైలిలో అలవరుచుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..

click me!

Recommended Stories