ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ సైడ్ ఆలూ కర్రీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

Published : Jun 07, 2022, 02:20 PM IST

ఆలూతో ఎన్నో రకాల వంటలను వండుకోవచ్చు. అలానే ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ సైడ్ ఆలు కూర స్పైసీగా (Spicy) భలే టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ కూర తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
16
ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ సైడ్ ఆలూ కర్రీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

కావలసిన పదార్థాలు: నాలుగు ఉడికించిన ఆలూలు (Boiled potatoes), రెండు ఉల్లిపాయలు (Onions), రెండు టమోటాలు (Tomatoes), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), ఒక స్పూన్ జీలకర్ర (Cumin).
 

26

సగం స్పూన్ సోంపు (Anise), ఒక స్పూన్ దంచిన ధనియాలు (Crushed coriander), పావు స్పూన్ వాము (Bishopsweed), చిటికెడు ఇంగువ (Asparagus), ఒక స్పూన్ ధనియాల పొడి (Coriander powder), ఒక టేబుల్ స్పూన్ కారం (Chili powder), పావు స్పూన్ పసుపు (Turmeric).
 

36

రుచికి సరిపడా ఉప్పు (Salt), సగం స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), సగం స్పూన్ గరం మసాల (Garam masala), సగం స్పూన్ నిమ్మరసం (Lemon juice), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, ఒక స్పూన్ కసూరీ మేతీ (Kasuri Methi), పావు కప్పు నూనె (Oil).
 

46

తయారీ విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేగిన తరువాత  జీలకర్ర, సోంపు, వాము, దంచిన ధనియాలు, చిటికెడు ఇంగువ వేసి బాగా ఫ్రై (Fry well) చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తరువాత ఉల్లిపాయ తరుగు వేసి తక్కువ మంట (Low flame) మీద మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.
 

56

ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన (Raw smell) పోయేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాల, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని (Mix well) చిన్నగా కట్ చేసుకున్న టమోటా తరుగు వేసి బాగా ఉడికించుకోవాలి.
 

66

తరువాత పావు కప్పు నీళ్లు (Water) పోసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని ముందుగా ఉడికించి చిదుముకున్న (Mashed) ఆలూ   మిశ్రమాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు నీళ్లు, కసూరి మేతి వేసి కూర నుంచి నూనె పైకి తేలేంత వరకు తక్కువ మంట మీద  బాగా ఉడికించుకోవాలి. చివరిలో కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన స్పైసీ ఆలూ కూర రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ రెసిపిని ట్రై చేయండి.

click me!

Recommended Stories