ఇంట్లోనే సేమియా దద్దోజనం.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

Published : Jun 04, 2022, 03:05 PM IST

ఇంట్లో సేమియా అందుబాటులో ఉంటే ముందుగా మనకు గుర్తొచ్చేది సేమియా ఉప్మా, పాయసం. ఇవి తప్ప ఇంకొకటి చేయాలనే ఆలోచనే రాదు.  

PREV
16
ఇంట్లోనే సేమియా దద్దోజనం.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

ఇలా ఎప్పుడూ చేసుకునే వంటలకు బదులుగా ఈ సారి కాస్త వెరైటీగా (Variety) సేమియాతో దద్దోజనం ట్రై చేయండి. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ దద్దోజనం చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం సేమియా దద్దోజనం (Semia Daddojanam) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

26

కావలసిన పదార్థాలు: ఒక కప్పు సేమియా (Semia), రెండు కప్పుల పెరుగు (Yogurt), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), రుచికి  సరిపడా ఉప్పు (Salt), సగం టీస్పూన్ ఆవాలు (Mustard), సగం టీస్పూన్ జీలకర్ర (Cumin),  ఒక టీస్పూన్ సెనగపప్పు (Senagapappu), ఒక టీస్పూన్ మినపప్పు (Minapappu), రెండు కరివేపాకు (Curries) రెబ్బలు.
 

36

ఒక చిన్న దోసకాయ (Cucumber), సగం టీస్పూన్ మిరియాల పొడి (Pepper powder), కొత్తిమీర (Coriander) తరుగు, కొన్ని దానిమ్మ గింజలు (Pomegranate seeds), రెండు టేబుల్ స్పూన్ ల ద్రాక్ష (Grapes), మూడు టేబుల్ స్పూన్ ల జీడిపప్పు (Cashew) పలుకులు, రెండు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
 

46

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక కప్పు సేమియా వేసి 80శాతం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న సేమియాని (Cooked semia) నీళ్లు లేకుండా వడగట్టుకుని (Filter) చన్నీళ్లను పోసి మరోసారి వడకట్టుకోవాలి.
 

56

ఇలా తయారుచేసుకున్న తాలింపు మిశ్రమాన్ని చల్లార్చుకోని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల పెరుగు వేసి బాగా గిలకొట్టాలి. తరువాత ఇందులో దోసకాయ తరుగు, ముందుగా ఉడికించుకున్న సేమియా, రుచికి సరిపడా ఉప్పు (Salt) వేసి బాగా కలుపుకోవాలి (Mix well).
 

66

ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసుకొని చల్లార్చుకున్న (Cooled) తాలింపు మిశ్రమం, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, జీడిపప్పు పలుకులు, కొన్ని దానిమ్మ గింజలు, ద్రాక్ష వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) సేమియా దద్దోజనం రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మీ కుటుంబ సభ్యులకు తప్పక నచ్చుతుంది.

click me!

Recommended Stories