నల్ల ద్రాక్షను తీసుకుంటే ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి కలిగే ప్రయోజనాలు బోలెడు!

Published : Jun 06, 2022, 03:36 PM IST

నల్ల ద్రాక్ష (Black grapes) తీపి, పులుపు రుచులను కలిగి ఉంటుంది. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం నల్ల ద్రాక్షను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు (Benefits) ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..   

PREV
18
నల్ల ద్రాక్షను తీసుకుంటే ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి కలిగే ప్రయోజనాలు బోలెడు!

నల్ల ద్రాక్షలో అనేక విటమిన్లతో పాటు పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ (Antioxidants) కూడ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) పెంచి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి.
 

28
grapes

అలాగే ఇందులో ఉండే పోషకాలు చర్మానికి జుట్టుకు కూడ మంచి ఫలితాలను  
అందిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు (Nutrients) శరీర బరువును తగ్గించడానికి సమర్థవంతంగా సహాయపడతాయి. కనుక అధిక బరువు సమస్యలతో (Overweight problems) బాధపడేవారు నల్ల ద్రాక్షను డైట్ లో చేర్చుకోవడం మంచిది.

38

నల్ల ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ (Phytochemicals) గుండెలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్స్ ను తగ్గించి గుండె సమస్యలను తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా (Heart healthy) ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతే కాకుండా కిడ్నీ సమస్యలు కూడా తగ్గుతాయి.
 

48

ద్రాక్షల్లో ఉండే యాంటి మ్యూటజేనిక్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని అడ్డుకొని పలు రకాల క్యాన్సర్లు (Cancers) రాకుండా కాపాడుతాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్లు కంటి ఆరోగ్యాన్ని (Eye health) మెరుగుపరుస్తాయి. దీంతో దృష్టిలోపం, రేచీకటి వంటి సమస్యలు దరిచేరవు.

58

కడుపులో మంట, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు నల్ల ద్రాక్ష రసంను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు (Digestive problems) తగ్గుతాయి. అంతేకాకుండా పేగులు శుభ్రపడి మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. దీంతో మలబద్దకం (Constipation) సమస్యలు కూడా తగ్గుతాయి.

68

అలాగే వీటిని తీసుకుంటే మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి (Memory) పెరుగుతుంది. కనుక మతిమరుపు సమస్యలతో బాధపడేవారు వీటిని తీసుకోవడం మంచిది. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించడంతో పాటు తలనొప్పి సమస్యలు కూడా దూరం చేస్తాయి. దీంతో శరీరానికి విశ్రాంతి (Relax) లభిస్తుంది.

78

డయాబెటిస్ (Diabetes) తో బాధపడే వారికి నల్లద్రాక్ష మంచి ఔషధంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి (Sugar levels) డయాబెటిస్ ను అదుపులో ఉంచుతాయి. కనుక డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు వీటిని తీసుకోవడం మంచిదని వైద్యులు అంటున్నారు.

88
grapes

నల్ల ద్రాక్ష చర్మానికి మంచి ఫలితాలను అందిస్తుంది. ఇవి చర్మ సమస్యలను (Skin problems) తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా తాజాగా ఉంచుతాయి. కనుక చర్మ సౌందర్యం కోసం నల్ల ద్రాక్షతో ఫేషియల్స్ ను ప్రయత్నిస్తే మంచిది. అలాగే జుట్టు సమస్యలను (Hair problems) తగ్గించి జుట్టు బలంగా, ఒత్తుగా, పెరిగేందుకు సహాయపడతాయి.

click me!

Recommended Stories