పచ్చి కొబ్బరి, గసగసాలతో చేసుకునే చామదుంపల పులుసు భలే రుచిగా ఉంటుంది. ఈ పులుసు తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం చామదుంప పులుసు (Chamadumpala pulusu) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: పావు కిలో చామదుంపలు (Chamadumpalu), ఒక ఉల్లిపాయ (Onion) తరుగు, రెండు పచ్చి మిరపకాయలు (Green chilies), రెండు ఎండు మిరపకాయలు (Dry chillies), ఒక స్పూన్ సోంపు (Anise), నాలుగు టేబుల్ స్పూన్ ల పచ్చికొబ్బరి (Raw coconut) తురుము, ఒక స్పూన్ గసగసాలు (Poppy), రెండు కరివేపాకు (curry leaves) రెబ్బలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste).
చిటికెడు ఇంగువ (Hing), పావు స్పూన్ పసుపు (Turmeric), ఒక స్పూన్ కారం (chilli), ఒక స్పూన్ ధనియాల పొడి (Coriander powder), ఒక స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), సగం స్పూన్ మెంతుల పొడి (Fenugreek powder), సగం స్పూన్ ఆవాలు (Mustard), సగం కప్పు చింతపండు పులుసు (Tamarind soup), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, రుచికి సరిపడా ఉప్పు (Salt), నాలుగు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
తయారీ విధానం: ముందుగా చిలకడ దుంపలను శుభ్రపరచుకుని కుక్కర్ లో వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న (cooked) చిలకడ దుంపలకు తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చికొబ్బరి తురుము, గసగసాలు వేసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడెక్కిన తరువాత ఆవాలు, ఎండు మిరపకాయలు, సోంపు, కరివేపాకులు వేసి ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయ తరుగు వేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై (Fry) చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత పసుపు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన (Raw smell) పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసుకున్న పచ్చికొబ్బరి, గసగసాల పేస్టు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక కప్పు నీళ్లు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, మెంతుల పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు, ఉడికించుకున్న చామదుంప ముక్కలు వేసి తక్కువ మంట (Low flame) మీద కూర నుంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చామదుంప ముక్కలు బాగా ఉడికిన తరువాత చివరిలో కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) చామదుంప పులుసు రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీ కుటుంబ సభ్యులకు తప్పక నచ్చుతుంది.