మునగాకు తెలగపిండి కూర ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. ఓసారి ట్రై చెయ్యండి!

Published : Apr 19, 2022, 02:06 PM IST

మునగాకు (Drumstick leaves) ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసినదే. కానీ చాలామందికి తెలగపిండి (Telagapindi) గురించి సరైన అవగాహన లేదు.  

PREV
17
మునగాకు తెలగపిండి కూర ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. ఓసారి ట్రై చెయ్యండి!

 నువ్వుల నుంచి నూనె తీయగా వచ్చే పిప్పినే తెలగపిండి అని అంటారు. మునగాకు, తెలగపిండి రెండు పదార్థాలను కలిపి కూర చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

27

తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో చేసుకునే ఈ కూర తయారీ విధానం కూడా సులభం. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులకు ఈ కూర బాగా నచ్చుతుంది. అలాగే ఇది ఒక మంచి హెల్తీ రెసిపీ (Healthy recipe). ఈ రెసిపీని తరచుగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు (Digestive problems) తగ్గుతాయి. అలాగే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అనేకం. 
 

37

కావలసిన పదార్థాలు: ఒక కప్పు మునగాకు (Drumstick leaves), ఒక కప్పు తెలగపిండి (Telagapindi), రుచికి సరిపడా ఉప్పు (Salt), చిటికెడు పసుపు (Turmeric), కరివేపాకు రెబ్బలు (Curries), ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి (Garlic) తరుగు, పావు స్పూన్ ఆవాలు (Mustard), పావు స్పూన్ జీలకర్ర (Cumin), ఒక స్పూన్ సెనగపప్పు (Senagapappu), ఒక స్పూన్ మినప్పప్పు (Minappappu), నాలుగు ఎండు మిరపకాయలు (Dried chillies), నాలుగు స్పూన్ ల నూనె (Oil).
 

47

తయారీ విధానం: ముందుగా మునగాకులను తీసుకొని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు పసుపు, ఉప్పు అలాగే తెలగపిండి వేసి బాగా కలుపుకోవాలి (Mix well). పిండి ఉండలు (Lumps) కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
 

57

ఇప్పుడు మరో స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి నూనె (Oil) వేడెక్కిన తరవాత ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి తరుగు వేసి తాలింపు పెట్టుకోవాలి. తరువాత ఇందులో శుభ్రపరచు కున్న మునగాకును (Drumstick leaves) కూడా వేసి బాగా కలుపుకోవాలి. మునగాకును బాగా మగ్గించుకోవాలి.
 

67

తరువాత అందులో ఉడికించిన తెలగపిండి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై  (Low flame) మగ్గించాలి. అంతే ఎంతో రుచికరమైన మునగాకు తెలగపిండి కూర (Munagaku Telagapindi kura) రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చెయ్యండి. ఈ కూర అన్నం లోకి సైడ్ డిష్ గానూ, చపాతీలలోకి తింటే భలే రుచిగా ఉంటుంది.
 

77

ఈ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మునగాకు, తెలగపిండిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ రెసిపీని తరచూ తీసుకుంటే రక్తహీనత (Anemia), ఎముకల బలహీనత (Bone weakness) వంటి ఇతర సమస్యలు కూడ తగ్గుతాయి.

click me!

Recommended Stories