గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకుని పరగడుపున తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

Published : Apr 16, 2022, 03:20 PM IST

అందరి వంటింటిలో పసుపు (Turmeric) అందుబాటులో ఉంటుంది. పసుపులో అనేక ఔషధ గుణాలు (Medicinal properties) ఉంటాయి.  

PREV
19
గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకుని పరగడుపున తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. కనుక ప్రతిరోజూ పరగడుపున గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకుని తాగితే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

29

పసుపులో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బయోటిక్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తాయి. అలాగే పసుపులో ఉండే కర్క్యుమిన్ (Curcumin) అనేక అనారోగ్య సమస్యలను (Illness issues) తగ్గించడానికి సహాయపడుతుంది. కనుక శరీరానికి పసుపును రోజులో కొద్ది మోతాదులోనైనా అందిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

39

జీర్ణ సమస్యలు తగ్గుతాయి: పరగడుపున గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకుని తాగితే జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తగ్గడంతో పాటు జీర్ణ సమస్యలు (Digestive problems), మలబద్ధకం సమస్యలు (Constipation problems) కూడా తగ్గుతాయి.
 

49

బరువు తగ్గుతారు: పసుపు కలిపిన గోరువెచ్చని నీటిని ప్రతిరోజూ తీసుకుంటే శరీరంలోని అధిక కొవ్వు (Fat) కరిగిపోతుంది. దీంతో బరువు తగ్గుతారు (Lose weight). కనుక బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ పరగడుపున పసుపు కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోవడం మంచిది.
 

59

షుగర్ అదుపులో ఉంటుంది: షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ పసుపు కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు (Sugar levels) తగ్గుతాయి. దీంతో షుగర్ (Sugar) అదుపులో ఉంటుంది. కనుక షుగర్ వ్యాధితో బాధపడేవారికి చక్కటి పరిష్కారం గోరువెచ్చని పసుపు నీరు.
 

69

కీళ్ల నొప్పులు తగ్గుతాయి: పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ (Antioxidant) గుణాలు వాపు సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. కనుక ప్రతి రోజూ గోరువెచ్చని పసుపు కలిపిన నీటిని తీసుకుంటే కీళ్ల నొప్పుల (Arthritis) నుంచి ఉపశమనం కలుగుతుంది. దీంతో కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
 

79

గుండె ఆరోగ్యంగా ఉంటుంది: ప్రతి రోజూ ఈ నీటిని తీసుకుంటే రక్త నాళాలలో ఉండే అడ్డంకులు తొలగిపోయి రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ (Cholesterol levels) తగ్గి గుండెపోటు (Heart attack) వంటి సమస్యలు దరిచేరవు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు సమస్యలు కూడా తగ్గుతాయి.
 

89

చర్మం సురక్షితంగా ఉంటుంది: పసుపులో ఉండే కర్క్యుమిన్ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. దీంతో మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు (Skin problems) తగ్గిపోతాయి. అంతేకాకుండా  చర్మ సౌందర్యం (Skin beauty) మరింత రెట్టింపవుతుంది.
 

99

లివర్ ఆరోగ్యంగా ఉంటుంది: ప్రతిరోజూ పసుపు కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే లివర్ లోని వ్యర్థాలు బయటకు పోతాయి. దీంతో లివర్ ఆరోగ్యంగా (Liver health) ఉంటుంది. అలాగే జీవక్రియల (Metabolism) పనితీరు మెరుగుపడుతుంది. కనుక ప్రతిరోజూ పసుపు కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోవడం మంచిది.

click me!

Recommended Stories