ఇలా స్నానం చేస్తే అలాంటి సమస్యలు తగ్గడంతో పాటు మెరిసిపోయే చర్మ సౌందర్యం మీ సొంతం!

Published : Apr 16, 2022, 04:11 PM IST

ఉరుకుల పరుగుల జీవితంలో శరీరం ఒత్తిడికి (Stress) లోనవుతుంది. ఒత్తిడి కారణంగా శరీరం అలసటకులోనై ఒళ్ళు నొప్పులు, నిద్రలేమి, చర్మ సమస్యలు వంటి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి.  

PREV
17
ఇలా స్నానం చేస్తే అలాంటి సమస్యలు తగ్గడంతో పాటు మెరిసిపోయే చర్మ సౌందర్యం మీ సొంతం!

ఈ సమస్యలన్నింటిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ చేసుకునే స్నానం (Bath) కూడా మంచి ఉపశమనాన్ని అందిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి ఏ విధంగా స్నానం చేస్తే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

27

ఒత్తిడి, అలసట వంటి సమస్యలను దూరం చేసుకుని తిరిగి శరీరానికి ఉత్సాహాన్ని అందించాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తూ స్నానం చేస్తే మంచిది. దీంతో శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) కలగడంతో పాటు చర్మ సమస్యలు (Skin problems) కూడ తగ్గి చర్మానికి మంచి ప్రయోజనం కలుగుతుంది. దీంతో మెదడుకు ప్రశాంతత కలిగి ఒత్తిడి, అలసట వంటి సమస్యలు తగ్గి నిద్ర బాగా పడుతుంది.
 

37

నువ్వుల నూనె, రోజ్ ఎసెన్షియల్ ఆయిల్: గోరువెచ్చని నువ్వుల నూనెను (Sesame oil) ఒంటికి పట్టించి సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత ఒంటికి ఆవిరి పట్టుకోవాలి. తరువాత రెండు చుక్కల రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ (Rose essential oil) ని నీళ్లలో కలిపి స్నానం చేయాలి. ఇలా చేస్తే ఒత్తిడి, అలసట వంటి సమస్యలు దూరమవుతాయి. దీంతో శరీరానికి ప్రశాంతత కలుగుతుంది.
 

47

యాపిల్ సైడర్ వెనిగర్: స్నానం చేసే నీళ్లలో రెండు కప్పుల యాపిల్ సైడర్ వెనిగర్ (Apple cider vinegar) కలిపి ఆ నీటిలో పది నిమిషాల పాటు శరీరం మునిగి ఉండేలా చేస్తే ఒత్తిడి, అలసట సమస్యలు (Fatigue problems) దూరమవుతాయి.  అలాగే చర్మకణాలలో పేరుకుపోయిన మృతకణాలు, మలినాలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
 

57

గులాబీ రేకులు: గులాబీ రేకులలో (Rose petals) కూడా ఒత్తిడి సమస్యలను దూరం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. కనుక ఒక లీటర్ నీటిలో గుప్పెడు గులాబీ రేకులను వేసి బాగా మరిగించి (Boiled) ఆ నీటిని స్నానం నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మానికి తేమ అంది తాజాగా కనిపిస్తుంది. అలాగే ఒత్తిడి, అలసట సమస్యలు కూడా దూరమవుతాయి.
 

67

నిమ్మరసం, రోజ్ వాటర్: స్నానం చేసే నీళ్లలో కొద్దిగా నిమ్మరసం (Lemon juice), రోజ్ వాటర్ (Rose water) వేసి కలుపుకోవాలి. ఆ నీటితో స్నానం చేస్తే చర్మం లోపలి నుంచి శుభ్రపడి తిరిగి కాంతివంతంగా మారుతుంది. అలాగే జిడ్డు సమస్యలు తగ్గిపోయి ఎక్కువ సమయం తాజాగా కనిపించేలా చేస్తుంది. దీంతో శరీరానికి ప్రశాంతత అంది ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోతాయి.
 

77

వెనిగర్, తేనె: స్నానం చేసే నీటిలో ఒక కప్పు వెనిగర్ (Vinegar), ఒక స్పూన్ తేనె (Honey) వేసి కలుపుకోవాలి. ఈ నీటితో స్నానం చేస్తే అధిక ఎండ తీవ్రత కారణంగా అలసిన చర్మానికి సాంత్వన చేకూరి చికాకు సమస్యలు తగ్గిపోతాయి. అలాగే చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీంతో చర్మ సౌందర్యం మరింత రెట్టింపవుతుంది.

click me!

Recommended Stories