వేరుశెనగ లడ్డు.. ఎప్పుడైనా తిన్నారా? ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?

First Published Sep 3, 2022, 12:17 PM IST

ప్రజలకు వేరుశనగ గింజల గురించి వాటి ఉపయోగాల గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ వేరుశనగ బలమైన ఆహారం అని చెప్పవచ్చు. ఈ గింజలలో నూనె శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రజలు తయారు చేసుకునే వంట నూనె ప్రధానంగా దీని నుంచి సేకరించబడుతుంది.
 

భారతదేశం మొత్తంగా పండే ఈ పంట ఆంధ్రాలో ప్రధాన మెట్ట పంటగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా నీరు ఎక్కువగా దొరికే రాయలసీమ ప్రజలు ఈ పంటను బాగా పండిస్తారు. ఈ వేరుశనగ బాగా చల్లని ప్రదేశాల్లో అధిక దిగుబడి అందిస్తుంది. అంతేకాకుండా గుల్లగా ఉండే వ్యవసాయ భూముల్లో ఈ పంట మరింత దిగుబడి పెంచుతుంది. ఈ వేరుశన వేరుశనగ నుంచి వచ్చే నూనె ద్వారా డాల్డా తయారు చేస్తారు.
 

వీటిలో అనేక రకాల ప్రోటీన్లు విటమిన్లు ఉన్నాయి. ఈ నూనె నుంచి సబ్బులు, సౌందర్య పోషకాలకు ఉపయోగిస్తారు. మరి ఇటువంటి వేరుశనగలనుంచి మీరు వినాయక చతుర్థి సందర్భంగా మీ ఇంట్లో వినాయకుడికి ఎంతో రుచికరమైన వేరుశనగ లడ్డుని పెట్టవచ్చు . ఇప్పుడు మనం ఆ వేరుశనగ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
 

ముందుగా ఒక కప్పు శెనగ శనగపప్పు తీసుకోవాలి. అందులో బెల్లం ఒకటి లో నాలుగో వంతు తీసుకోవాలి. వేరుశనగలను బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంతసేపు శనగలను చల్లార్చనివ్వాలి. ఇక మిక్సీలో వేసి ఆ పప్పును బాగా రుబ్బి వేయాలి. ఆ తర్వాత అందులో బెల్లం వేసి ఆ పప్పును మరింత రుబ్బాలి. ఇక ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసి లడ్డుగా తయారు చేసుకోవాలి.
 

ఇక అలా తయారు చేసుకున్న లడ్డూలు కొంతసేపు గాలి చొరబడకుండా ఓ డబ్బాలో నిలువ చేసుకోవాలి. అలా ఎన్ని రోజులైనా ఈ లడ్డూలు పాడవకుండా ఉంటాయి. ఇక ఎంతో రుచికరమైన ప్రత్యేకంగా ఉండే వేరుశనగ లడ్డులు రెడీ అయినట్లే... ఇవి చూడ్డానికి చాలా కొత్తగా బావుంటాయి. ఇక వీటి రుచి కూడా బాగా ఉంటుంది. కాబట్టి వేరుశనగ లడ్డును ఈరోజే మీ ఇంట్లో తయారు చేసుకొని రుచి చూసేయండి!

click me!