ఉదయం లేవగానే చాలా మందికి కప్పు టీ కానీ, కాఫీ గానీ తాగనిది రోజు మొదలుకాదు. వేడి వేడి టీ, కాఫీ పొగలుకక్కుతూ.. కమ్మని వాసనతో మన ముందుకు వస్తే ప్రాణం లేచినట్లే అవుతుంది. ముఖ్యంగా.. భారతీయుల ఇళ్లల్లో టీ చాలా కామన్ పానియం. మనకు ఇంత ఆనందాన్ని ఇచ్చే టీ... మన జీవిత ఆయుష్షును కూడా పెంచుతుంది అంటే నమ్ముతారా..? మీరు చదివింది నిజమే.. టీ తాగడం వల్ల ఆయుష్షు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.