మళ్లీ మళ్లీ తినాలనిపించే చిరోటి స్వీట్ రెసిపీ.. ఎలా తయారు చెయ్యాలంటే?

First Published Jan 19, 2022, 3:39 PM IST

స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లోనే ఎంతో రుచికరమైన (Delicious) చిరోటి స్వీట్ రెసిపీని ట్రై చేయండి. ఈ స్వీట్ ఐటమ్ చక్కెర పాకంతో నుండి పొరలు పొరలుగా జ్యూసీగా తినడానికి భలే రుచిగా ఉంటుంది. తక్కువ పదార్థాలతో సులభంగా తయారు చేసుకునే ఈ స్వీట్ రెసిపీ మీ పిల్లలకు బాగా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం చిరోటి స్వీట్ రెసిపీ (Chiroti Sweet Recipe) తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

కావలసిన పదార్థాలు: ఒక కప్పు మైదా (Maida), రెండు టేబుల్ స్పూన్ ల బొంబాయి రవ్వ (Bombay Ravva), చిటికెడు ఉప్పు (Salt), మూడు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee), సగం స్పూన్ యాలకుల పొడి (Cardamom powder), ఒక కప్పు చక్కెర (Sugar), ఒక టీస్పూన్ నిమ్మరసం (Lemon Juice), ఢీ ఫ్రై కి సరిపడా నూనె (Oil), మూడు టేబుల్ స్పూన్ ల మొక్కజొన్న పిండి (Corn flour).
 

తయారీ విధానం: ఒక గిన్నెలో మైదాపిండి,   బొంబాయి రవ్వ, నెయ్యి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి చపాతి పిండిలా బాగా కలుపుకోవాలి (Mix well). ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టఫింగ్ (Stuffing) కోసం ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ ల మొక్కజొన్న పిండిని తీసుకొని కరిగించిన నెయ్యి వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
 

ఇప్పుడు చక్కెర పాకం (Caramel) కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక కప్పు చక్కెర వేసి కొన్ని నీళ్ళు (Water) పోసి మరిగించుకోవాలి. చక్కెర కరిగి తీగ పాకం వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక స్పూన్ నిమ్మరసం, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.  
 

ఇప్పుడు ముందుగా కలుపుకొని అరగంట పాటు నానబెట్టిన మైదా పిండిని (Soaked maida dough) తీసుకొని ఆరు ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండల్ని చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా ఆరు ఉండను తీసుకొని చపాతీల్లా ఒత్తుకొని వాటిపైన మొక్కజొన్న పేస్ట్ (Corn paste) ను రాసి ఒకదానిపై ఒకటి ఉంచాలి. ఇలా ఒక దానిపై ఒకటి ఉంచి రోల్ గా చుట్టుకోవాలి.
 

చుట్టుకున్న రోల్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఒక్కో ముక్కను తీసుకొని కొద్దిగా వెడల్పుగా ఒత్తుకోవాలి. ఇదేవిధంగా అన్నింటిని చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil) వేసి వేడి చేసుకోవాలి (Should be heated).
 

ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒత్తుకున్న మైదాపిండి ముక్కలను వేసి తక్కువ మంట (Low flame) మీద ఎర్రగా వేయించుకుని ప్లేట్ లో తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కెర పాకంలో ముంచి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే చిరోటి స్వీట్ రెడీ (Ready).

click me!