క్యాబేజీ టమోటా పప్పు.. ఎలా చెయ్యాలో తెలుసా?

First Published Jun 30, 2022, 2:19 PM IST

క్యాబేజీలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ చాలా మంది పిల్లలు క్యాబేజీని తినడానికి పెద్దగా ఇష్టపడరు.
 

అలాంటి సమయంలో వారికీ క్యాబేజీతో పప్పు చేసి పెడితే ఏ పేచీ లేకుండా చాలా ఇష్టంగా తింటారు (Eaten willingly). ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. తింటుంటే ఇంకాస్త తినాలనిపిస్తుంది. ఈ పప్పును ఎంతో సులభంగా తక్కువ సమయంలో వండుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం క్యాబేజీ టమాటా పప్పు (Cabbage Tomato pappu) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

కావలసిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు (Red gram), పావు కేజీ క్యాబేజీ (Cabbage) తరుగు, ఒక పెద్ద ఉల్లిపాయ (Onion), నాలుగు టమోటాలు (Tomatoes), పది నుంచి పదిహేను పచ్చి మిరపకాయలు (Chilies), కొద్దిగా చింతపండు (Tamarind), పావు స్పూన్ పసుపు (Turmeric), రుచికి సరిపడా ఉప్పు (Salt).
 

పది వెల్లుల్లి (Garlic) రెబ్బలు,  కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, సగం స్పూన్ ఆవాలు (Mustard), సగం స్పూన్ జీలకర్ర (Cumin), రెండు ఎండు మిరపకాయలు (Dried chillies), రెండు కరివేపాకు (Curries) రెబ్బలు, నాలుగు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
 

తయారీ విధానం: కుక్కర్ తీసుకొని అందులో  కడిగిన కందిపప్పు, క్యాబేజీ తరుగు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఉల్లిపాయ తరుగు, పచ్చి మిరపకాయలు, టమోటా ముక్కలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర తరుగు, కొద్దిగా నూనె (Oil), మూడు గ్లాసుల నీళ్లు (Water) పోసి కుక్కర్ మూత పెట్టి ఎక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
 

కుక్కర్ విజిల్స్ నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ఆవిరి (Steam) పోయాక మూత తీసి పప్పు గిత్తతో పప్పును మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడేక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై (Fry) చేసుకోవాలి.
 

తరువాత కరివేపాకు రెబ్బలు, ఎండు మిరపకాయలను వేసి ఫ్రై చేసుకుని పప్పుకు పోపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) నోరూరించే క్యాబేజీ టమోటా పప్పు రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఎప్పుడూ రొటీన్ గా చేసుకునే క్యాబేజీ కూరలకు బదులుగా ఈసారి కాస్త వెరైటీగా (Variety) క్యాబేజీతో పప్పును ట్రై చేయండి.
 

ఈ పప్పు చాలా రుచిగా ఉండడంతో మీ పిల్లలు మళ్లీమళ్లీ అడిగి చేయించుకుని తినడానికి ఇష్టపడతారు. కనుక క్యాబేజీ అంటే ఇష్టపడని పిల్లలకు ఇలా క్యాబేజీని పప్పు రూపంలో అందించడం మంచిది. ఇలా ఎప్పటికప్పుడు కొత్త వంటలను (New dishes) ట్రై చేయండి.. కుటుంబ సభ్యులతో కలిసి కొత్త రుచులను (New flavors) ఆస్వాదించండి..

click me!