స్పైసి ఆలూ మజ్జిగ పులుసు.. ఎలా తయారు చెయ్యాలంటే?

First Published Jun 29, 2022, 2:55 PM IST

ఆలూతో వండుకునే మజ్జిగ పులుసు చాలా స్పైసీగా (Spicy), రుచిగా ఉంటుంది. ఈ పులుసు తయారీ విధానం కూడా సులభం.
 

ఎప్పుడూ వండుకునే మజ్జిగ పులుసు రెసిపీలకు బదులుగా ఈసారి ఆలూతో మజ్జిగ పులుసును ట్రై చేయండి. ఈ రెసిపీ మీ కుటుంబ సభ్యులకు తప్పక నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఆలూ మజ్జిగ పులుసు (Aloo majjiga pulusu) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

కావలసిన పదార్థాలు: పావు కేజీ బంగాళదుంపలు (Potatoes), పావు లీటరు చిలికిన పెరుగు (Yogurt), ఒక పెద్ద ఉల్లిపాయ (Onion) తరుగు, మూడు పచ్చి మిరపకాయలు (Chilies), ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), ఒక స్పూన్ ఆవాలు (Mustard), ఒక ఇంచు దాల్చిన చెక్క (Cinnamon), నాలుగు లవంగాలు (Cloves), ఒక స్పూన్ ఆమ్చూర్ పౌడర్ (Amchoor powder).
 

ఒక స్పూన్ ధనియాల పొడి (Coriander powder), ఒక స్పూన్ కారం పొడి (Chili powder), పావు స్పూన్ పసుపు (Turmeric), ఒక స్పూన్ ఆవకాయ (Mango pickle), ఒక స్పూన్ గరం మసాల (Garam masala), రుచికి సరిపడా ఉప్పు (Salt), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, నాలుగు స్పూన్ ల నూనె (Oil).
 

తయారీ విధానం: ముందుగా బంగాళదుంపలను తీసుకొని శుభ్రపరచుకుని ఉడికించుకొని చల్లారాక ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి పెట్టి నూనె వేసి వేడెక్కిన తరువాత ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప (Boiled potatoes) ముక్కలను వేసి తక్కువ మంట మీద మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై (Fry) చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
 

ఇప్పుడు ఇదే కడాయిలో మరి కాస్త నూనె వేసి వేడెక్కిన తరువాత ఆవాలు, దాల్చిన చెక్క, లవంగాలు, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన (Chopped) ఉల్లిపాయ తరుగు వేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన (Raw smell) పోయేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.
 

ఇప్పుడు ఇందులో కారం పొడి, పసుపు, ఆమ్చూర్ పౌడర్, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి (Mix well). మసాలాలన్నీ బాగా వేగిన తరువాత ఆవకాయ వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాగా చిలికిన పెరుగు, ఒక గ్లాస్ నీళ్లు వేసి బాగా కలుపుకోని ముందుగా ఫ్రై చేసుకున్న ఆలూ ముక్కలు, గరం మసాల, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన స్పైసీ ఆలూ మసాలా మజ్జిగ పులుసు రెడీ.

click me!