అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా.. అయితే ఈ రెమిడీస్ ను ప్రయత్నిస్తే సరి!

First Published Jun 29, 2022, 1:34 PM IST

కొందరి స్త్రీలలో హార్మోన్ల సమస్య (Hormonal problem), వంశపారంపర్యం (Genealogy) వంటి ఇతర సమస్యల కారణంగా పురుషుల మాదిరిగా ఒంటినిండా వెంట్రుకలే కనిపిస్తాయి.
 

ఈ సమస్య కారణంగా నలుగురిలో వారు కలవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మరి ఈ సమస్య పరిష్కారం కోసం ఇంటిలోనే కొన్ని చిట్కాలను ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అవాంఛిత రోమాల (Unwanted hair) కోసం ఉపయోగించే వ్యాక్సింగ్, త్రెడ్డింగ్, హెయిర్ రిమూవల్ క్రీమ్స్ తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా వీటి కారణంగా చర్మం నల్లబడడం, దద్దర్లు వంటి చర్మ సమస్యలు (Skin problems) వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీటికి బదులు కొన్ని ఇంటి చిట్కాలను క్రమం తప్పకుండా ప్రయత్నిస్తే సహజంగా అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోవచ్చు.
 

మొక్కజొన్న పొడి, పంచదార, ఎగ్ వైట్: ఒక కప్పు తీసుకొని అందులో మొక్కజొన్న పొడి (Corn powder), ఎగ్ వైట్ (Egg white), పంచదార (Sugar) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి ఆరిన తరువాత పీల్ ఆఫ్ మాస్క్ లా తీసేయాలి. ఇలా వారానికి ఒకటి రెండుసార్లు ప్రయత్నిస్తే అవాంఛిత రోమాల  పెరుగుదల తగ్గుతుంది.
 

సెనగపిండి, పసుపు, నువ్వుల నూనె: సెనగపిండి (Gram flour), పసుపును (Turmeric) సమాన భాగాలుగా తీసుకొని నువ్వుల నూనె (Sesame oil) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్నచోట అప్లై చేసుకోవాలి. ఆరిన తరువాత కొద్దికొద్దిగా తడి చేస్తూ సున్నితంగా మర్దన చేసుకుంటూ అవాంఛిత రోమాలను తొలగించుకుంటే సరి.
 

అరటిపండు, ఓట్ మీల్: ఒక కప్పులో బాగా  పండిన అరటిపండు గుజ్జు (Banana pulp), రెండు టేబుల్ స్పూన్ ల ఓట్ మీల్ పొడి (Oatmeal powder) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంపై అప్లై చేసుకొని ఆరిన తరువాత కొద్ది కొద్దిగా తడి చేస్తూ రుద్దుతూ తొలగిస్తే అవాంఛిత రోమాలు సులభంగా తొలగిపోతాయి. 
 

బియ్యం పిండి, పెరుగు: బియ్యం పిండి (Rice flour), పెరుగును (Yogurt) సమాన భాగాలుగా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా తడి చేస్తూ రుద్దుతూ అవాంఛిత రోమాలను తొలగించుకోవాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు ప్రయత్నిస్తే అవాంఛిత రోమాల పెరుగుదల తగ్గుతుంది.
స్పూన్ల శెనగపిండికి కొంచెం పసుపు, పాలు (Milk) కలుపుకొని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో పూయాలి. అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్ర పరుచుకోవాలి. ఇలా చేయడం ద్వారా అవాంఛిత రోమాల సమస్య తగ్గుతుంది.  

బొప్పాయి, పసుపు: అవాంఛిత రోమాల నివారణ కోసం పచ్చి బొప్పాయిని (Papaya) తీసుకొని పేస్టులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి చిటికెడు పసుపు (Turmeric) కలిపి అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా ప్రయత్నిస్తే మంచి ప్రయోజనం పొందవచ్చు.
 

బంగాళదుంప రసం: అవాంఛిత రోమాలను తొలగించేందుకు బంగాళదుంప (Potato) చక్కటి పరిష్కారం. ఇందుకోసం బంగాళదుంపను తీసుకుని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని (Finely paste) రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని రాత్రి పడుకునే ముందు అవాంఛితరోమాలుపై అప్లై చేసుకొని ఉదయాన్నే శుభ్రపరచుకోవాలి.
 

పై చెప్పిన వాటిలో ఏదో ఒక రెమెడీని వారానికి  రెండు సార్లు ప్రయత్నిస్తే అవాంఛిత రోమాల  సమస్య క్రమంగా తగ్గుతుంది. అయితే ఇవి అన్ని చర్మతత్వాలకు సరిపోకపోవచ్చు. కనుక ముందుగా ప్యాచ్ టెస్ట్ (Patch test) చేసుకున్నాకే ప్రయత్నించాలి. వీటి ఉపయోగంతో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) లేకపోతే వీటిని కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

click me!