అలసందల మసాల కూరను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

Published : May 31, 2022, 01:03 PM IST

అలసందలను బొబ్బర్లు (Bobberlu) అని కూడా పిలుస్తారు. అలసందలతో వడలు, మసాలా కూరలను ట్రై చేయవచ్చు.  

PREV
16
అలసందల మసాల కూరను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

ఇలా ఈ గింజలతో చేసుకునే మసాలా కూరలు రోటీ, చపాతీ, రైస్ లోకి బాగుంటాయి. ఈ మసాలా కూర తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం అలసందల మసాల కూర (Alasandula masala kura) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

26

కావలసిన పదార్థాలు: ఒక కప్పు అలసందలు (Alasandulu), ఒక పెద్ద ఉల్లిపాయ (Onion), మూడు టమోటాలు (Tomatoes), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), ఒక ఇంచు దాల్చిన చెక్క (Cinnamon), ఐదు లవంగాలు (Cloves), మూడు యాలకులు (Cardamom), ఒక బిర్యానీ ఆకు (Biryani leaf), రెండు టీస్పూన్ ల అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste).
 

36

ఒక స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ (Kashmiri chilli powder), ఒక స్పూన్ జీలకర్ర (Cumin), ఒక స్పూన్ కారం (Chili powder), ఒక స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), ఒక స్పూన్ ధనియాల పొడి (Coriander powder), రుచికి సరిపడా ఉప్పు (Salt), సగం స్పూన్ గరం మసాల (Garam masala), కొత్తిమీర (Coriander) తరుగు, పావు కప్పు నూనె (Oil), రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee).
 

46

తయారీ విధానం: ముందుగా కుక్కర్ తీసుకొని అందులో రాత్రంతా నానబెట్టి (Soaked) కడిగిన   అలసందలు, నీళ్లు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ నూనె వేసి బాగా కలుపుకొని మూత పెట్టి అలసందలను మెత్తగా ఉడికించుకోవాలి (Cook until soft).
 

56

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె, నెయ్యి వేసి వేడి చేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు వేసి మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన (Raw smell) పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, గరం మసాల, ఉప్పు వేసి తక్కువ మంట (Low flame) మీద రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి.
 

66

మసాలాలన్నీ వేగిన తరువాత టమోట పేస్ట్ (Tomato paste) వేసి తక్కువ మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న అలసందలను నీళ్లతో సహా వేసి కూర నుంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని చివరిలో కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) అలసందల మసాలా కూర రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి.

click me!

Recommended Stories