తోటకూర తింటే అలాంటి సమస్యలన్ని తగ్గిపోతాయ్.. అంతేకాదు ఎన్నో లాభాలు?

Published : May 30, 2022, 02:06 PM IST

పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలతో పాటు ఆరోగ్యానికి ఆకుకూరలు కూడా అంతే ముఖ్యం.  

PREV
110
తోటకూర తింటే అలాంటి సమస్యలన్ని తగ్గిపోతాయ్.. అంతేకాదు ఎన్నో లాభాలు?

అన్ని రకాల ఆకుకూరలతో పాటు తోటకూరలో (Asparagus) కూడా పోషకాలు మెండుగా ఉంటాయి. కనుక దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు (Health benefits) బోలెడు అని వైద్యులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

210

తోటకూరలో అన్నిరకాల విటమిన్లతో (Vitamins) పాటు మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, మాంగనీస్, ఐరన్ వంటి వాటితో పాటు పీచు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, తక్కువ క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇలా ఎన్నో పోషకాలు కలిగిన తోటకూరను పోషకాల గని (Mine of nutrients) అని పిలుస్తారు. ఈ పోషకాలు శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
 

310

బరువు తగ్గుతారు: తోటకూరలో పీచు పదార్థం (Fiber) అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకుంటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలనిపించదు. కనుక అధిక బరువు సమస్యతో బాధపడేవారు దీన్ని డైట్ లో చేర్చుకుంటే సులభంగా బరువు తగ్గుతారు (Lose weight).
 

410

రక్తహీనత సమస్యలు తగ్గుతాయి: తోటకూరలో ఐరన్ (Iron) పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. దీంతో మన శరీరానికి కావలిసిన రక్తం లభించి రక్తహీనత (Anemia) సమస్యలు తగ్గుతాయి. కనుక ముఖ్యంగా స్త్రీలు తోటకూరను తీసుకోవడం ఎంతో మంచిది.
 

510

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది: ఈ ఆకుకూరలో ఉండే పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచి తిన్న ఆహారం తేలికగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ (Digestive system) మెరుగుపడుతుంది. అలాగే మలవిసర్జన సాఫీగా జరిగేలా చేసి మలబద్ధకం (Constipation) సమస్యలను దూరం చేస్తుంది. దీంతో ఉదర ఆరోగ్యం కూడా బాగుంటుంది.
 

610

గుండె ఆరోగ్యంగా ఉంటుంది: ఇందులో గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి గుండెకు రక్త ప్రసరణను  మెరుగుపరుస్తాయి. దీంతో అన్ని రకాల గుండె జబ్బులకు దూరంగా ఉండి గుండె ఆరోగ్యంగా (Heart health) ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు సమస్యలు (High blood pressure problems) కూడా తగ్గుతాయి.
 

710

కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది: ఇందులో విటమిన్ ఏ తో (Vitamin A) పాటు వివిధ రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి సమస్యలను తగ్గించి కంటి ఆరోగ్యాన్ని (Eye health) మెరుగుపరుస్తాయి. దీంతో దృష్టిలోపం, రేచీకటి వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కాబట్టి కంటి సమస్యలతో బాధపడే వారు తోటకూరను తీసుకోవడం ఎంతో మంచిది.
 

810

వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది: ఇందులో ఉండే విటమిన్ సి (Vitamin C) అనేక వ్యాధులను అడ్డుకుని శరీర వ్యాధి నిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది. రోజులో 100 గ్రాముల తోటకూరను తీసుకుంటే 716 క్యాలరీల శక్తి శరీరానికి లభిస్తుంది. దీంతో రోజంతా హుషారుగా ఉండవచ్చు. కనుక అన్ని వయసుల వారు ఈ ఆకుకూరను తీసుకోవడం మంచిది.
 

910

ఎముకలు దృఢంగా మారుతాయి: ఇందులో అధిక మొత్తంలో ఉండే క్యాల్షియం (Calcium) ఎముకల పటుత్వానికి సహాయపడుతుంది. దీంతో ఎముకలు దృఢంగా (Bone stiffness) మారి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి కూడ ఉపశమనం కలుగుతుంది. కనుక క్రమం తప్పకుండా ఈ ఆకుకూరను ఆహార జీవనశైలిలో చేసుకుందాం.
 

1010

అంతేకాకుండా ఈ ఆకుకూరను తీసుకుంటే హైపర్ టెన్షన్ వంటి సమస్యలు తగ్గి మానసిక ఆరోగ్యం (Mental health) మెరుగుపడుతుంది. అలాగే అన్ని రకాల ఇన్ఫెక్షన్లకు (Infections) దూరంగా ఉండవచ్చు. కనుక తోటకూరను తీసుకుందాం.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం..

click me!

Recommended Stories