ఈ చిన్న టిప్స్ పాటిస్తూ బట్టతలకు ఇలా గుడ్ బై చెప్పండి.. ఆ టిప్స్ ఇవే!

Published : May 30, 2022, 02:55 PM IST

జుట్టు అధికమొత్తంలో రాలిపోయి బట్టతల (Bald) సమస్యలను ఎదుర్కోవడానికి ముఖ్యకారణం పోషకాహార లోపం, వాతావరణంలోని కాలుష్యం, ఇన్ఫెక్షన్లు, వంశ పారంపర్యం, అనారోగ్య సమస్యలు, చెడు అలవాట్లు.  

PREV
17
ఈ చిన్న టిప్స్ పాటిస్తూ బట్టతలకు ఇలా గుడ్ బై చెప్పండి.. ఆ టిప్స్ ఇవే!
bald

ఇలా అనేక కారణాలతో జుట్టుకు సరైన పోషకాలు అందక నిర్జీవంగా మారి అధిక మొత్తంలో రాలిపోతుంది. ఈ సమస్యలన్నింటికీ తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేందుకు ఇంట్లోనే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను (Tips) పాటిస్తే మంచిది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

27
bald

మనం అందంగా కనిపించాలంటే ముఖ సౌందర్యంతో పాటు జుట్టు సౌందర్యం కూడా ముఖ్యమే. కనుక కాలానుగుణంగా వాతావరణంలోని మార్పులకు తగ్గట్టు జుట్టు సంరక్షణ (Hair care) కోసం ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. కనుక బయట మార్కెట్లో దొరికే  ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ బదులుగా ఇంట్లోనే సహజసిద్ధమయిన పద్ధతిలో చేసుకునే చిట్కాలు మంచి ఫలితాలను అందిస్తాయి. దీంతో జుట్టు రాలడం (Hair fall) తగ్గి బట్టతల సమస్యకు దూరంగా ఉండవచ్చు.
వరకు కారణమైతే కొన్నిసార్లు పోషకాల లోపం కూడా ఒక తరం నుంచి మరొక తరానికి వర్తిస్తుంది. అయితే ఇప్పుడు శరీరంలో ఏ పోషకాలు లోపిస్తే బట్టతల (Baldness) వస్తుందో తెలుసుకుందాం. 

37
bald

సెనగపిండి, పెరుగు: ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ ల సెనగపిండి (Senaga pindi), రెండు టేబుల్ స్పూన్ ల పెరుగు (Yogurt) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల మాడుకు, జుట్టుకు బాగా అప్లై చేసి గంట తరువాత గాఢత తక్కువగల షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 

47
bald

కొబ్బరి నూనె, ఉల్లిపాయ రసం: కొబ్బరి నూనెకు (Coconut oil) ఉల్లిపాయ రసాన్ని (Onion juice) కలుపుకుని తలకు బాగా అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఈ మిశ్రమంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టు రాలే సమస్యలను తగ్గించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి.

57
bald

దాల్చిన చెక్క పౌడర్, తేనె, ఆలివ్ ఆయిల్: ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ (Cinnamon powder) కు తేనె (Honey), ఆలివ్ ఆయిల్ (Olive oil) ను కలుపుకొని తలకు బాగా అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టుకు తగిన పోషణ అందుతుంది. దీంతో జుట్టు రాలడం తగ్గి బట్టతల సమస్యలు దరిచేరవు.

67
bald

బీట్ రూట్ ఆకులు: బీట్ రూట్ ఆకులలో (Beetroot leaves) జుట్టు పెరుగుదలకు సహాయపడే అనేక పోషకాలు (Nutrients) ఉంటాయి. కనుక ఈ ఆకులను మెత్తగా పేస్ట్ చేసుకుని తల మాడుకు, జుట్టు మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత  గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

77
bald

ఆలివ్ ఆయిల్, నిమ్మరసం: ఆలివ్ ఆయిల్ (Olive oil) కు రెండు స్పూన్ ల నిమ్మరసం (Lemon juice) కలుపుకొని తలకు బాగా అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత గాఢత తక్కువగల షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం చుండ్రు, తలలో ఇన్ఫెక్షన్ లను తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో జుట్టురాలే సమస్యలు తగ్గుతాయి.

click me!

Recommended Stories