తమిళనాడు స్టైల్ ఖుస్కా పులావ్.. ఎలా తయారు చెయ్యాలంటే?

Published : May 30, 2022, 01:24 PM IST

తమిళనాడు స్టైల్ లో చేసుకునే  ఖుస్కా పులావ్ నాన్ వెజ్ కూరలతో కానీ, ఏ కూర లేకున్నా రైతాతో కానీ తీసుకున్న భలే రుచిగా (Delicious) ఉంటుంది. దీన్ని ఎంతో సులభంగా కుక్కర్ లోనే తయారుచేసుకోవచ్చు.  

PREV
17
తమిళనాడు స్టైల్ ఖుస్కా పులావ్.. ఎలా తయారు చెయ్యాలంటే?

ఈ పులావ్ మంచి సువాసనలు వెదజల్లుతూ, చాలా రుచిగా ఉండడంతో తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం తమిళనాడు స్టైల్ ఖుస్కా పులావ్ (Tamil Nadu style Khuska Pulao) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

27

కావలసిన పదార్థాలు: ఒక కప్పు బాస్మతి బియ్యం (Basmati rice), సగం కప్పు పెరుగు (Yogurt), ఒక ఉల్లిపాయ (Onion), రెండు టమోటాలు (Tomatoes), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), ఒక ఇంచు దాల్చిన చెక్క (Cinnamon), మూడు యాలకులు (Cardamom), ఒక బిర్యానీ ఆకు (Biryani leaf), నాలుగు లవంగాలు (Cloves), ఒక స్టార్ మొగ్గ (Star bud).
 

37

చిన్న ముక్క జాజికాయ (Nutmeg), ఒక స్పూన్ జీలకర్ర (Cumin), ఒక స్పూన్ సోంపు (Anise), రుచికి సరిపడా ఉప్పు (Salt), పావు స్పూన్ పసుపు (Turmeric), ఒక స్పూన్ కారం (Chili powder), సగం స్పూన్ గరం మసాల (Garam masala), సగం కట్ట కొత్తిమీర (Coriander) తరుగు, కొన్ని పుదీనా (Mint) ఆకులు, రెండు టేబుల్ స్పూన్ ల నూనె (Oil), ఒక టేబుల్ స్పూన్ నెయ్యి (Ghee).
 

47

తయారీ విధానం: ముందుగా బాస్మతి బియ్యాన్ని గంటసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నూనె, నెయ్యి వేసి వేగిన తరువాత లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు,  దాల్చిన చెక్క, స్టార్ మొగ్గ, జాజికాయ వేసి వేయించుకోవాలి. తరువాత జీలకర్ర, సోంపు (Anise) వేసి ఒక నిమిషం పాటు ఫ్రై (Fry) చేసుకోవాలి.
 

57

ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు వేసి మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన (Raw smell) పోయేంత వరకూ ఫ్రై చేసుకుని పసుపు, కారం, ఉప్పు, టమోటాలు వేసి బాగా ఉడికించుకోవాలి (Cook well).
 

67

టమోటాలు బాగా ఉడికిన తరువాత గరం మసాల, పెరుగు వేసి బాగా కలుపుకుని నూనె పైకి తేలేంత వరకు తక్కువ మంట (Low flame) మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా తరుగు వేసి బాగా కలుపుకొని గంట ముందు నానబెట్టుకొన్న బాస్మతి బియ్యాన్ని (Soaked basmati rice) వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
 

77

ఇప్పుడు ఒక కప్పు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఎక్కువ మంట మీద ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. కుక్కర్ ఆవిరి (Steam) తగ్గిన తరువాత మూత తీసి వేడి వేడిగా సువాసనలు వెదజల్లే ఖుస్కా పులావ్ ను సర్వ్ (Serve) చేస్తే సరి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ కుటుంబ సభ్యులకు ఈ రెసిపి తప్పక నచ్చుతుంది..

click me!

Recommended Stories