దోసకాయతో స్కిన్ కేర్.. ఇలా ఉపయోగిస్తే మంచి లాభాలు గ్యారెంటీ?

Published : May 28, 2022, 02:47 PM IST

దోసకాయలో (Cucumber) ఉండే వివిధ రకాల ఖనిజాలు, విటమిన్లు ఆరోగ్యనికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్య పోషణకు కూడా  మంచి ఫలితాలను అందిస్తాయి.  

PREV
17
దోసకాయతో స్కిన్ కేర్.. ఇలా ఉపయోగిస్తే మంచి లాభాలు గ్యారెంటీ?

దోసకాయతో చేసుకునే ఫేస్ ప్యాక్ లు చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపించేందుకు సహాయపడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం దోసకాయను చర్మ సంరక్షణ (Skin care) కోసం ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

27

దోసకాయలో చర్మసంరక్షణకు సహాయపడే సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు (Bleaching properties), యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) సమృద్ధిగా ఉంటాయి. ఇవి మొటిమలు, మచ్చలు, పొడి, జిడ్డు వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. దీంతో మచ్చలు లేని కాంతివంతమైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది. కనుక బయట మార్కెట్లో దొరికే  ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కు బదులుగా ఇలా ఇంటిలోనే దోసకాయలతో చేసుకునే ఫేస్ ప్యాక్ లను ప్రయత్నించండి.. 
 

37

మెరిసే చర్మం కోసం: దోసకాయ రసంలో (Cucumber juice) కొన్ని చుక్కల నిమ్మరసం (Lemon juice) వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత తడి చేసిన కాటన్ వస్త్రంతో తుడుచుకోవాలి. ఇలా చేస్తే మెరిసే చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది.
 

47

ట్యాన్ ను తొలగిస్తుంది: దోసకాయ రసంలో (Cucumber juice), కొద్దిగా రోజ్ వాటర్ (Rosewater), కొద్దిగా నిమ్మరసం (Lemon juice) కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మంపైన పేరుకుపోయిన ట్యాన్  తొలగిపోతుంది.

57

మొటిమలు, మచ్చలు తగ్గుతాయి: రెండు స్పూన్ ల దోసకాయ రసం (Cucumber juice), ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ (Olive oil), రెండు స్పూన్ ల తేనె (Honey), ఒక స్పూన్ నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.  

67

పొడి చర్మం కోసం: రెండు టేబుల్ స్పూన్ ల దోసకాయ రసం (Cucumber juice), ఒక టేబుల్ స్పూన్ పాల మీగడను (Milk cream) తీసుకుని బాగా కలుపుకోని ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ చర్మానికి తేమను అందించి పొడి చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

77

జిడ్డు చర్మం కోసం: మూడు స్పూన్ ల దోసకాయ రసం (Cucumber juice), ఒక స్పూన్ మజ్జిగ (Buttermilk), రెండు స్పూన్ ల సెనగ పిండి (Senaga flour), ఒక స్పూన్ నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే జిడ్డు చర్మ సమస్యలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.

click me!

Recommended Stories