ఒంట్లో కొవ్వు పెరిగిపోయిందా..? ఈ లక్షణాలు కనిపిస్తాయి..!

సన్నగా ఉన్నవారి శరీరంలోనూ అధిక శాతం కొవ్వు ఉండే అవకాశం ఉంటుందట. మన శరీంలో అధికంగా ఫ్యాట్ ఉంటే.. కొన్ని లక్షణాలతోనే తెలుసుకోవచ్చట. మరి ఆ లక్షణాలేంటో ఓసారి చూద్దాం..

symptoms of cholesterol

ఎవరైనా కొంచెం ఉండాల్సినదానికంటే ఎక్కువ లావుగా కనపడితే  వాళ్ల శరరీంలో కొవ్వు ఎక్కువగా ఉందని..  సన్నగా  ఉన్నవారికి కొవ్వు ఉండదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ.. మన శరీర పరిమాణంతో కొవ్వు శాతం ఎంత ఉందో చెప్పలేం. సన్నగా ఉన్నవారి శరీరంలోనూ అధిక శాతం కొవ్వు ఉండే అవకాశం ఉంటుందట. మన శరీంలో అధికంగా ఫ్యాట్ ఉంటే.. కొన్ని లక్షణాలతోనే తెలుసుకోవచ్చట. మరి ఆ లక్షణాలేంటో ఓసారి చూద్దాం..

1. శరీరంలో అధికంగా కొవ్వు ఉన్నవారి గుండెకు రక్త ప్రసరణ జరిగా జరగదట. రక్త ప్రసరణ జరిగా జరగకపోవడం వల్ల తరచూ గుండె నొప్పి, చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటాయట. అలా నొప్పి వస్తోంది అంటే.. వెంటనే ఫ్యాట్ చెక్ చేయించుకొని, దానికి తగిన ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి.


2.అంతేకాదు శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటే.. హార్ట్ బీట్ కూడా సరిగా ఉండదు. గుండె ఎప్పుడూ దడగా ఉంటుంది. కొవ్వు.. గుండెకు చేరాల్సిన రక్త ప్రసరణకు అడ్డు పడటం వల్ల ఈ సమస్య తలెత్తుతూ ఉంటుందట.

cholesterol

3.శరీరంలో అధిక శాతం కొవ్వు  ఉన్నవారిలో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు..కాళ్లలో లింబ్స్ ఏర్పడతాయట. తరచూ విపరీతంగా కాళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి.  కొంత దూరం నడిచినా.. విపరీతమైన కాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారట.

cholesterol

4.మన కళ్లు చూసి కూడా మన శరీరంలో అధికంగా కొవ్వు పేరుకపోయిందో లేదో కూడా చెప్పేయవచ్చట. అదెలాగంటే.. అధికంగా ఫ్యాట్ మన శరరంలోకి చేరితే.. కంటిలోపల పసుపు రంగు పొర ఏర్పడుతుందట. అలా కంటిలో వచ్చింది అంటే.. వాళ్ల శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోయిందనే అర్థం.

cholesterol and diabetes

5.శరరీంలో కొవ్వు అధికంగా పేరుకుపోతే.. బాడీలోని అన్ని భాగాలకు ఆక్సీజన్ సరఫరా సరిగా జరగదు. దీని వల్ల... తరచూ నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న పనులకే విపరీతంగా తలనొప్పి వస్తూ ఉంటుంది.

cholesterol


6.అంతేకాదు.. శరరీంలో కొవ్వు ఎక్కువగా ఉంటే.. బ్లాడర్ లో రాళ్లు కూడా ఏర్పడుతూ ఉంటాయి. దీని వల్ల మూత్ర విసర్జన చేసిన సమయంలోనూ విపరీతంగా నొప్పి వస్తూ.. ఇబ్బంది పెడుతూ ఉంటుంది.  ఈ లక్షణాలు మీలో కూడా కనిపిస్తున్నాయి అంటే...  కచ్చితంగా.. కొలిస్ట్రాల్ టెస్టు చేయించుకొని.. తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం.

Latest Videos

click me!