పప్పును ప్రెజర్ కుక్కర్ లో ఉడికించకూడదా?

First Published Jan 11, 2024, 2:13 PM IST

చాలా మంది పప్పును ప్రెషర్ కుక్కర్ లోనే ఉడికిస్తారు. ఎందుకంటే పప్పు తొందరగా ఉడుకుతుందని. ఇదంతా బానే ఉంది కానీ.. అసలు ప్రెషర్ కుక్కర్ లో ఉడికించిన పప్పును తినడం సురక్షితమేనా? 
 

ఒకప్పుడు ఓపిక తోని వంటలను తయారుచేసేవారు. ఇంటి పనులకు గంటల సమయాన్ని కేటాయించేవారు. కానీ ఇప్పుడు అన్ని గంటలోనే అయిపోవాలి అని చూస్తున్నారు. ఇలా ఫాస్ట్ ఫాస్ట్ గా పనులు అయిపోవాలి అనుకోవడం వల్లే మన నిత్య జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పులు మనకు ఉపయోగకరంగా ఉన్నా.. ప్రమాదాలను మాత్రం కలిగిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 
 

ముఖ్యగా ప్రతి ఒక్కరు వంటతో సహా ఇంటి పనులను వీలైనంత సులభంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇంటి పనుల కోసం గంటల తరబడి లేదా ఎక్కువగా కష్టపడటం లేదన్న మాట. అందుకే ఇందుకోసం ఎన్నో రకాల అధునాతన పరికరాలను, సౌకర్యాలను వినియోగిస్తున్నారు. మనం రోజూ మన కిచెన్లలో ఉపయోగించే ప్రెషర్ కుక్కర్ చేసే పని అంతా ఇంతా కాదు. ఇది పనిని సులభతరం చేయడానికి బాగా సహాయపడుతుంది. ప్రెషర్ కుక్కర్ లో వంట చేయడం వల్ల టైం చాలా మిగులుతుంది. వంట తొందరగా పూర్తవుతుంది. అలాగే గ్యాస్ కూడా ఆదా అవుతుంది. 
 

Latest Videos


అయితే ఇలాంటి ప్రెషర్ కుక్కర్ లో కొన్ని ఆహారాలను వండకూడదనే మాటను మీరు వినే ఉంటారు. వీటిలో ఒకటి పప్పులు. అవును కుక్కర్ లో పప్పు వండటం మంచిది కాదని, ఆరోగ్యానికి చెడ్డదని కొందరు అంటుంటారు. సమస్య ఏంటంటే పప్పును కుక్కర్ లో ఉడికించిన పప్పును తింటే కాళ్ల నొప్పులు వస్తాయని కింతమంది అంటున్నారు. 
 

ప్రెజర్ కుక్కర్ లో వంట చేసేటప్పుడు నురగ ఏర్పుడుతుంది. దీనివల్లే ప్రెషర్ కుక్కర్ లో ఉడకబెట్టిన పప్పును జనాలు కీళ్ల నొప్పులతో ముడిపెడతారని నిపుణులు అంటున్నారు. వివిధ సిద్ధాంతాల ప్రకారం.. నురగ యూరిక్ ఆమ్లాన్ని కలిగి ఉన్న సాపోనిన్లు. ఇది కీళ్ల సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

సాపోనిన్లు మొక్కలలో కనిపిస్తాయి. ఇవి సబ్బు లాథర్ ను ఉత్పత్తి చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. కాగా రెడ్ మీట్, ఆల్కహాల్ వంటి ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం కంటే ప్రెషర్ కుక్కర్ వండిని పప్పును తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఏం ఎక్కువగా ఉండదని నిపుణులు అంటున్నారు. కానీ పప్పు అధిక-ప్యూరిన్ ఆహారాల వర్గంలోకి రాదు.
 

dal

ఇకపోతే పప్పులో వచ్చే నురగ అంతా సపోనిన్లే కాదు. ఈ పప్పులోచాలా తక్కువ మొత్తంలో సాపోనిన్లు ఉంటాయి. మిగిలింది మొత్తం వదులైన పిండి పదార్ధం, ప్రోటీన్. అంతేకాకుండా ఈ వంట చాలా సాపోనిన్లను నాశనం చేస్తుంది. సపోనిన్లను మితమైన మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఇవి యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. అలాగే మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.

Pressure Cooker

ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పప్పును ప్రెషర్ కుక్కర్ లో ఉడికించడం వల్ల సమయం, శక్తి ఆదా అవుతాయి. అలాగే దీనిలోని పోషకాలు కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి. అయితే ప్రెషర్ కుక్కర్ లో పప్పు వండేటప్పుడు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే కుక్కర్ లో పప్పును ఉడికించేటప్పుడు కుక్కర్ లోంచి వాటర్ బయటకు వస్తున్నట్టైతే ముందుగానే  అందులో కొంచెం నూనె వేయండి. 

click me!