రోజూ అల్లం టీ తాగితే ఏమౌతుందో తెలుసా?

Published : Jun 11, 2023, 07:15 AM IST

అల్లంలో ఉండే జింజెరోల్ అనే సమ్మేళనం ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఇలాంటి అల్లం టీని రోజూ తాగితే..  

PREV
17
రోజూ అల్లం టీ తాగితే ఏమౌతుందో తెలుసా?
ginger tea

అల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అల్లంలో జింజెరోల్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే అల్లం టీ మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. రోజూ అల్లం టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27

శరీరం చల్లబడుతుంది

అల్లం టీని రెగ్యులర్ గా తాగొచ్చు. దీన్ని తాగడం వల్ల మీ శరీరం చల్లబడుతుంది. వేడిమి చేసే అవకాశం తగ్గుతుంది. 

బరువు తగ్గుతారు

ప్రతిరోజూ అల్లం టీని తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారని ఎన్నో అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. అల్లం టీ లో ఉండే గుణాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇది మీరు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. 
 

37

ginger teA

ఇమ్యూనిటీ పవర్

అల్లం టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఈ టీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీంతో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లకు మీ శరీరం దూరంగా ఉంటుంది. కాబట్టి అల్లం టీని రెగ్యులర్ గా తాగండి. 

47

చర్మ ఆరోగ్యం

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే అల్లం టీ చర్మ ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. 

గుండె జబ్బులు

ఆర్థరైటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా అల్లం టీ సహాయపడుతుంది. అల్లంలో జింజెరోల్స్, షోగోల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బలమైన శోథ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవే ఎన్నో రోగాల ముప్పును తగ్గిస్తాయి. 

57

జీర్ణ సమస్యలు

కడుపునొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు, అలసట, అజీర్థి వల్ల కలిగే గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా అల్లం ఎంతో సహాయపడుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.

67


బ్లడ్ షుగర్ లెవెల్స్

అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని పరిశోధనలు కనుగొన్నాయి. కాబట్టి అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

మెదడు ఆరోగ్యం

అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అల్లం మెదడును కాబట్టి అల్లం టీని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి. 
 

77

అధిక రక్తపోటు

అల్లం టీ అధిక రక్తపోటును తగ్గించడానికి తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా మెరుగుపరచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి గుండెను గుండెపోటుకు దూరంగా ఉంచుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories