ఉబ్బసం బరువు పెరిగేలా చేస్తుందా?

First Published Jun 10, 2023, 12:50 PM IST

ఆస్తమాతో బాధపడేవారు బరువు పెరిగినట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉబ్బసం నేరుగా బరువు పెగడానికి కారణం కాదు. కానీ..
 

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉబ్బసంతో బాధపడుతున్నారు. ఇది దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి. ఉబ్బసం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుతు, దగ్గు వంటి సమస్యలను కలిగిస్తుంది. ఉబ్బసం ప్రధానంగా వాయుమార్గాలు, శ్వాసను ప్రభావితం చేసినప్పటికీ.. బరువు పెరగడంతో సహా ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అయితే ఉబ్బసంతో బాధపడేవారు బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 

ఉబ్బసం, బరువు పెరగడం మధ్యనున్న సంబంధం

నిపుణుల ప్రకారం..ఉబ్బసం, బరువు పెరగడానికి మధ్య సంబంధం ఉంది. ఈ సమస్య ఉన్నవారు శారీరక శ్రమలో తక్కువగా పాల్గొంటారు. అలాగే ఎన్నో మందులను వేసుకుంటారు. ఇవే ఉబ్బసం ఉన్నవారు బరువు పెరిగేలా చేస్తాయి. ఉబ్బసం ఎలా బరువును పెంచుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

శారీరక శ్రమ తగ్గడం

ఉబ్బసం లక్షణాలు ఒక వ్యక్తి శారీరక కార్యకలాపాలలో పాల్గొనే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది నిశ్చల జీవనశైలి, మొత్తం కేలరీలు పెరగడానికి దారితీస్తుంది. ఇది కాస్త బరువు పెరగడానికి కారణమవుతుంది. ఉబ్బసం ఉన్నవారు వారి లక్షణాలను తగ్గించుకోవడానికి శారీరక శ్రమలో పాల్గొనాలి. 

భావోద్వేగ కారకాలు

ఉబ్బసం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య కొన్నిసార్లు భావోద్వేగ ఒత్తిడికి దారితీస్తుంది. ఇది ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తుంది. అలాగే బరువు పెరగడానికి దారితీస్తుంది. ఎమోషనల్ ఈటింగ్ బరువు పెరగడానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. 

మందుల దుష్ప్రభావాలు

ఉబ్బసం లక్షణాలను తగ్గించడానికి ఉపయోగించే కొన్ని మందులు కూడా బరువు పెరగడానికి దారితీస్తాయి. ముఖ్యంగా నోటి కార్టికోస్టెరాయిడ్స్ బరువు పెరగడానికి కారణమవుతాయి. కార్టికోస్టెరాయిడ్స్ మంటను తగ్గిస్తుంది. ఇది ఉబ్బసం లక్షణాలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ కార్టికోస్టెరాయిడ్స్ ను దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల ఆకలి పెరుగుతుంది. అలాగే శరీరంలో ద్రవాల నిల్వ పెరుగుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అయితే ఉబ్బసం లక్షణాలను తగ్గించడానికి ఉపయోగించే పీల్చే కార్టికోస్టెరాయిడ్స్ నోటి కార్టికోస్టెరాయిడ్స్ తో పోలిస్తే బరువు పెరిగే ప్రమాదం తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 

బరువు పెరగడానికి కారణమయ్యే ఉబ్బసం మందులు

నోటి కార్టికోస్టెరాయిడ్స్

నిపుణుల ప్రకారం.. తీవ్రమైన ఉబ్బసం సమస్య ఉన్నప్పుడు.. ప్రిడ్నిసోన్ లేదా డెక్సామెథాసోన్ వంటి మందులను వాడుతుంటారు. నోటి కార్టికోస్టెరాయిడ్స్ శక్తివంతమైన శోథ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా వీటిని ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే బరువు పెరిగిపోతారు.

పీల్చే కార్టికోస్టెరాయిడ్స్

ఫ్లూటికాసోన్ లేదా బుడెసోనైడ్ వంటి పీల్చే కార్టికోస్టెరాయిడ్స్ సాధారణంగా వాయుమార్గ మంటను తగ్గించడానికి, లక్షణాలను నియంత్రించడానికి వీటిని దీర్ఘకాలికంగా ఉపయోగిస్తారు. నోటి కార్టికోస్టెరాయిడ్స్ తో పోలిస్తే పీల్చే కార్టికోస్టెరాయిడ్స్ తో బరువు పెరిగే ప్రమాదం తక్కువగా ఉంది. అయినప్పటికీ..  వీటిని దీర్ఘకాలికంగా ఎక్కవగా ఉపయోగిస్తే బరువు పెరుగుతారు. 

ఈ మందులను ఉపయోగించే వ్యక్తులందరూ బరువు పెరిగిపోరు. మందుల వాడకం వ్యవధి, మోతాదు, వ్యక్తిగత సున్నితత్వం, ఆహారం, వ్యాయామం వంటి జీవనశైలి కారకాలపై ఇది ఆధారపడి ఉంటుంది. 
 

click me!