Health Tips: యాలకులని ఈ విధంగా తీసుకుంటే.. పొట్ట పూర్తిగా కరిగిపోతుంది!

Published : Oct 03, 2023, 12:02 PM IST

Health Tips: యాలకులు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే వీటిని పోషకాల భాండాగారం అంటారు అయితే ఈ యాలకులు తినడం వలన పొట్ట పూర్తిగా తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం.  

PREV
16
Health Tips: యాలకులని ఈ విధంగా తీసుకుంటే.. పొట్ట పూర్తిగా కరిగిపోతుంది!

 సుగంధ ద్రవ్య పంటగా పరిగణించే యాలకులు ఒక సూపర్ ఫుడ్ అని చాలామందికి తెలియదు. ఇందులో ఉండే పోషకాలు, ఫైబర్ కంటెంట్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. యాలకులు తీసుకోవడం వలన శరీరంలోని పోషకాల లోపం తొలగిపోతుంది.

26

 అలాగే యాలికలలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, క్యాల్షియం, పొటాషియం మొదలైన అనేక మూలకాలు ఉంటాయి. ఈ రోజుల్లో తిండికి ఏమాత్రం వెనకాడకుండా స్లిమ్ గా ఉండాలని కోరుకుంటారు చాలామంది.
 

36

అలా అని వారి జీవన శైలిని మార్చుకోవటానికి ఇష్టపడరు. దీనివలన పొట్టలో సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి. మన శరీరంలో కొవ్వు పెరిగేకొద్దీ సమస్యలు తీవ్రతరమవుతాయి. అందుకే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వేడి నీటిలో రెండు యాలకులు పొడి చేసి  కలుపుకొని తాగటం వలన కొవ్వు కరిగిపోతుంది.

46

యాలకులు ఉబ్బరం లేదా అజీర్తిని తగ్గించడంలో సహాయపడే ఒక మంచి మసాలా. ఇది యాక్టివ్ కంఫాను కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. గట్ ఫ్లోరాను మరింత సమతుల్యం చేస్తుంది. అలాగే సాధారణ జీవక్రియకు కూడా యాలకులు ఎంతో ఉపయోగపడతాయి.

56

ఇందులో ఉండే నెలటోనిన్ శరీరంలో ఉండే కొవ్వుని కాల్చే ప్రక్రియని వేగవంతం చేస్తుంది. అలాగే యాలకులు శరీరంలో నిలువ ఉండిపోయిన ఆదనపు నీటిని మూత్రం ద్వారా  బయటికి పంపించడంలో సహాయపడుతుంది. అలాగే రోజు తీసుకోవడం వలన బ్యాక్టీరియా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

66

 అలాగే వీటిలో ఉండే పొటాషియం, ఫైబర్ కంటెంట్, రక్తప్రసరణను పెంచుతుంది. దీనివలన రక్తపోటు అదుపులో ఉంటుంది. యాలకులను రోజూ తీసుకోవటం వలన యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అలాగే టైప్ టు డయాబెటిస్ లో ఆకుపచ్చ యాలకులు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.

click me!

Recommended Stories