మీకు బీపీ సమస్య ఉందా? అయితే ఇంట్లో తయారుచేసిన ఈ డ్రింక్స్ ను తాగండి.. హై బీపీ అదుపులో ఉంటుంది

First Published | Oct 3, 2023, 10:51 AM IST

చిన్న పిల్లలు కూడా అధిక రక్తపోటు సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్యను తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే దీనివల్ల గుండెపోటు రావొచ్చు. మరెన్నో రోగాలు కూడా వస్తాయి. అయితే ఇంట్లో తయరుచేసిన కొన్ని డ్రింక్స్ ను తాగితే రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 

మారుతున్న జీవనశైలి, ఆరోగ్యాన్ని పాడుచేసే ఆహారాల వల్ల ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు ఒక ప్రమాదకరమైన సమస్య. దీని వల్ల గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యంతో పాటుగా ఎన్నో డేంజర్ రోగాలొచ్చే ప్రమాదం ఉంది. ఇంతేకాదు ఈ హై బీపీ కారణంగా కంటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే అధిక రక్తపోటును సకాలంలో గుర్తించాలి. చికిత్స తీసుకోవాలి. అలాగే జీవన శైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అయితే ఇంట్లో తయారుచేసిన కొన్ని పానీయాలను తాగినా బీపీ కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Ginger Tea

అల్లం టీ

అల్లం టీలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ టీ అధిక రక్తపోటు పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా, తొందరగా తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయండి. దానిలో అల్లం ముక్కలను వేసి బాగా మరగబెట్టండి. తర్వాత వడకట్టి రుచి కోసం ఒక టీస్పూన్ తేనెను కలిపి తాగొచ్చు. ఈ అల్లం టీ హైబీపీని నియంత్రించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. 
 

Latest Videos


గ్రీన్ టీ

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ గ్రీన్ టీని తాగడం వల్ల అధిక రక్తపోటును నియంత్రణలోకి వస్తుంది. ఈ టీ శరీరంలోని విష పదార్థాలను కూడా బయటకు పంపడానికి ఎంతో సహాయపడుతుంది. బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. 

బెల్లం టీ

బెల్లంలో ఆంథోసైనిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హై బీపీని నియంత్రిస్తాయి. మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే బెల్లీ టీని ఎలాంటి భయం లేకుండా తాగండి. ఇది మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దీన్ని తయారు చేయడానికి బెల్లాన్ని నీటిలో వేసి మరగించి వడకట్టి తాగండి. దీన్ని వేడిగా లేదా చల్లగానైనా తాగొచ్చు. 
 

దానిమ్మ రసం

హైబీపీని నియంత్రించడంలో దానిమ్మ రసం ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దానిమ్మ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ రక్తాన్ని సన్నబర్చడానికి , రక్తపోటును నార్మల్ చేయడానికి సహాయపడతాయి.
 

చియా విత్తనాల వాటర్

చియా విత్తనాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి ఇవి హై బీపీ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. దీని కోసం చియా విత్తనాలను అరగంట పాటు నీటిలో నానబెట్టి తాగాలి.

click me!