గొంతునొప్పి, జలుబుతో బాధపడుతున్నారా? ఆవిరి పడితే ఈ సమస్యలే కాదు.. ఆ సమస్య కూడా తగ్గుతుంది

Published : Oct 03, 2023, 07:15 AM IST

జలుబు అంత తొందరగా తగ్గదు. దీనికి తోడు గొంతునొప్పి కూడా అటాక్ చేస్తుంది. ఈ రెండు ఎన్నో సమస్యలు వచ్చేలా చేస్తాయి. అయితే ఈ సమస్యలను ఆవిరితో కూడా సులువుగా తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. అవును ఆవిరి పడితే జలుబు, గొంతునొప్పి తగ్గడమే కాకుండా..   

PREV
14
గొంతునొప్పి, జలుబుతో బాధపడుతున్నారా? ఆవిరి పడితే ఈ సమస్యలే కాదు.. ఆ సమస్య కూడా తగ్గుతుంది

వాతావరణంలో చిన్నపాటి మార్పు వచ్చినా.. కొందరికి దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారికే వస్తాయి. ఇది జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమవుతుంది. అయితే వాటంతట అవే తగ్గిపోతాయని మందులను కూడా వాడకుండా ఉంటుంటారు కొందరు. కానీ కొన్ని సార్లు ఈ సమస్యలు ప్రమాదకరంగా మారుతాయి. చిన్న సమస్య కాస్త గొంతునొప్పి తలనొప్పి, శరీర నొప్పులు కూడా మొదలవుతాయి. అందుకే మీకు కూడా ఈ కాలానుగుణ సమస్యలు ఉంటే మందులు లేకుండా వీటిని తగ్గించుకోవాలనుకుంటే ఆవిరిని పట్టండి. అవును ఆవిరి మీ సమస్యలను తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇదేం కొత్త పద్ధతి కాదు. చాలా పాత, ప్రభావవంతమైన చికిత్స. ఆవిరి పట్టడం వల్ల మూసుకుపోయిన ముక్కు సులభంగా తెరుచుకుంటుంది. అలాగే గొంతునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆవిరి ఎలాంటి సమస్యలను తగ్గిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

24

steam

గొంతు నొప్పి పోతుంది

ఆవిరి పట్టడం వల్ల గొంతునొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. ఎలా అంటే ఆవిరిని పట్టడం వల్ల గొంతు కండరాలు సడలించబడతాయి. అలాగే గొంతు వాపు కూడా తగ్గుతుంది. ఆవిరి పట్టడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోవడం తొలగిపోయి రక్తప్రసరణ పెరుగుతుంది. ఇది మీ గొంతునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

34

మూసుకపోయిన ముక్కు నుంచి ఉపశమనం

వేడినీటి ఆవిరిని తీసుకోవడం వల్ల మూసుకపోయిన ముక్కు తెరుచుకుంటుంది. అలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన శ్లేష్మం పల్చబడి సులభంగా బయటకు వస్తుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కూడా పోగొడుతుంది. 

44

మంచి నిద్ర

ఆవిరిని పట్టడం వల్ల గొంతునొప్పి, జలుబు తగ్గడంతో పాటుగా మీకున్న నిద్ర సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆవిరి శ్వాసనాళాన్ని క్లియర్ గా చేస్తుంది. అలాగే ముక్కు మూసుకుపోయిన సమస్య కూడా పూర్తిగా పోతుంది. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. ఆవిరి థెరపీ శరీరంతో పాటుగా మనస్సును రిలాక్స్ చేస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories