సమ్మర్ లో ఇవి తప్పనిసరి.. నిమ్మ సబ్జా గింజల షర్బత్ ఖచ్చితంగా తాగాల్సిందే!

Published : Apr 25, 2022, 02:20 PM IST

ఎండలు ఎక్కువగా ఉండడంతో  నీళ్లు తాగిన కొద్ది సేపటికే నాలుక తడారిపోతోంది. కనుక నీళ్లతో పాటు శరీరానికి పోషకాలు (Nutrients) కలిగిన ద్రవపదార్థాలను (Fluids) అందించడం ముఖ్యం.  

PREV
16
సమ్మర్ లో ఇవి తప్పనిసరి.. నిమ్మ సబ్జా గింజల షర్బత్ ఖచ్చితంగా తాగాల్సిందే!

కనుక ఎండ తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడేందుకు నిమ్మ, సబ్జా గింజల జ్యూస్ లను తీసుకోవడం ముఖ్యం. ఈ జ్యూస్ లు దాహాన్ని తీరడంతో పాటు శరీరానికి శక్తిని అందించి రోజంతా హుషారుగా ఉండేందుకు సహాయపడుతాయి. ఇంకెందుకు ఆలస్యం వీటి తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

26

సబ్జా లెమన్ షర్బత్..
కావలసిన పదార్థాలు: ఒక నిమ్మకాయ (Lemon), రెండు స్పూన్ ల నానబెట్టిన సబ్జా గింజలు (Sabza nuts), పంచదార (Sugar), చిటికెడు ఉప్పు (Salt), పొడవుగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి (Chili), కొన్ని పుదీనా ఆకులు (Mint leaves), ఐస్ క్యూబ్స్ (Ice cubes), తగినన్ని నీళ్లు (Water).

36

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో సబ్జా గింజలను వేసి పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి (Soak). ఇప్పుడు నిమ్మకాయను తీసుకుని చిన్న స్లైసుల్ గా గుండ్రంగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులో గుండ్రంగా కట్ చేసుకున్న ఒక నిమ్మ స్లైసు (Lemon slice), పంచదార, చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి.
 

46

ఒక గ్లాసు షర్బత్ కు ఒక నిమ్మకాయ రసం, నానబెట్టుకున్న సబ్జా గింజలు, పుదీనా ఆకులు, ఐసు క్యూబ్స్, పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా (Delicious) ఉండే చల్లచల్లని సబ్జా లెమన్ షర్బత్ (Sabza Lemon Sharbat) రెడీ. ఈ షర్బత్ తీసుకుంటే శరీరానికి విటమిన్ సి  పుష్కలంగా లభించి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 

56

రూఅఫ్జా లెమన్ జ్యూస్..
కావలసిన పదార్థాలు: నాలుగు టేబుల్       స్పూన్ ల రూఅఫ్జా సిరప్ (Ruafza Syrup), ఒక నిమ్మకాయ రసం (Lemon juice), చిటికెడు ఉప్పు (Salt), చిటికెడు నల్ల ఉప్పు (Black salt),  కొద్దిగా మిరియాల పొడి (Pepper powder), ఐస్ క్యూబ్స్ (Ice cubes), తగినన్ని నీళ్లు (Water), తగినంత సోడా (Soda), రెండు స్పూన్ ల నానబెట్టుకున్న సబ్జా గింజలు (Sabza nuts).   

66

తయారీ విధానం: ఒక గ్లాసు తీసుకుని అందులో ఒక నిమ్మకాయ రసం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు నల్ల ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రూఅఫ్జా సిరప్, నానబెట్టిన సబ్జా గింజలు (Soaked sabza nuts), తగినన్ని నీళ్లు, సోడా, పుదీనా ఆకులు, ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చల్ల చల్లని రూఅఫ్జా లెమన్ జ్యూస్ (Ruafza Lemon Juice) రెడీ.

click me!

Recommended Stories