సోంపు గింజల కషాయంతో 7 రకాల లాభాలు.. అవి ఏమిటంటే?

Published : Apr 23, 2022, 02:07 PM IST

వంటింటి మసాలా గింజలలో అందుబాటులో ఉండే సొంపు గింజలు (Anise seeds) అనేక ఔషధ గుణాలను (Medicinal properties) కలిగి ఉంటుంది.  

PREV
17
సోంపు గింజల కషాయంతో 7 రకాల లాభాలు.. అవి ఏమిటంటే?

కనుక సోంపు గింజలతో కషాయం చేసుకొని తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా మంచి ఫలితాలు అందుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం సోంపు గింజల కషాయాన్ని తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

27

సోంపు గింజలలో విటమిన్ బి, విటమిన్ సి తోపాటు పొటాషియం, ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అంతేకాకుండా వీటితోపాటు యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants), పాలీఫినాల్స్ (Polyphenols) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడ్డ కొవ్వును కరిగించి అధిక బరువు సమస్యలను దూరం చేస్తాయి. కనుక బరువు తగ్గాలనుకునేవారు సోంపు గింజల కషాయాన్ని తీసుకుంటే మంచిది.
 

37

అలాగే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కడుపులో ఏర్పడే గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలకు చక్కని ఔషధంగా సోంపు గింజలు పనిచేస్తాయి.  సోంపుతో కషాయం చేసుకుని తాగితే తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడి జీర్ణ సంబంధిత సమస్యలు (Digestive problems) తగ్గడంతో పాటు మలబద్దకం (Constipation) సమస్య కూడా తగ్గిపోతాయి.
 

47

అంతేకాకుండా తిన్న ఆహారం శరీరానికి పట్టేలా చేయడం సోంపు గింజల ప్రత్యేకత. సోంపు గింజల కషాయాన్ని తాగితే శరీరంలో హానికరమైన టాక్సిన్స్ (Harmful toxins) పేరుకుపోకుండా చేస్తుంది. దీంతో శరీరంలో జీవక్రియల (Metabolism) ఫలితంగా ఏర్పడే వ్యర్థాలు బయటకు తొలగిపోయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా మహిళలు పీరియడ్స్ సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులను కూడా సోంపు గింజలు తగ్గిస్తాయి.
 

57

దంత సమస్యలతో (Dental problems) బాధపడేవారు సోంపు గింజలను నమిలి తింటే దంత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే సోంపు గింజలను వేడి నీటిలో వేసి ఆ నీటితో నోటిని పుక్కిలిస్తే నోటి దుర్వాసన (Bad breath) సమస్యలు తగ్గించడంతో పాటు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా బాలింతలు సోంపు గింజలను ఏదో ఒక రూపంలో తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.
 

67

జ్వరం వచ్చినప్పుడు సోంపు గింజల కషాయాన్ని తాగితే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే సాధారణంగా వచ్చే జలుబు, దగ్గులను కూడా  నివారిస్తుంది. సొంపులో ఉండే పోషక విలువలు శరీరపు కాంతిని పెంచడంతో పాటు చర్మంపై ఏర్పడే ముడతలను తొలగించి బిరుతైన, మృదువైన చర్మాన్ని ప్రసాదిస్తాయి. అలాగే ఇవి ముఖానికి రక్తప్రసరణ (Blood circulation) బాగా జరిగేలా చేసి చర్మ సౌందర్యాన్ని (Skin beauty) పెంచుతుంది.
 

77

అంతేకాకుండా కంటిచూపు మెరుగుపడుతుంది. (Improves eyesight). ఎముకలను దృఢంగా మారుతాయి. అలాగే జుట్టు సమస్యలు (Hair problems) తగ్గి జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. ఇలా అనేక ప్రయోజనాలు కలిగి ఉన్న సోంపు గింజలను ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..

click me!

Recommended Stories