పిల్లలకు బంగాళాదుంపలను, పండ్లను తినిపించొచ్చా?
సరిగ్గా వండిన లేదా మెత్తగా ఉడికించిన బంగాళాదుంపలను, కూరగాయలను, జున్ను, అరటిపండ్లను, బఠానీలను తినిపించొచ్చు. అయితే సరిగ్గా పండని లేదా ఉడికించని వాటిని అసలే ఇవ్వకూడదు. ముఖ్యంగా ముడివి. వండని ముడి క్యారెట్లు వంటి కూరగాయలను చిన్న పిల్లలకు తినిపించకూడదు. ఎందుకంటే ముడి కూరగాయల్లో నైట్రేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనివల్ల పిల్లలు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడతారు. వీటికి బదులుగా వారు సులువుగా తినేంత చిన్న సైజులో పండ్లను కట్ చేసి ఇవ్వండి.