థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉండే చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంధి. శక్తిని ఉపయోగించడంలో మీ శరీరానికి సహాయపడే హార్మోన్లని ఉత్పత్తి చేయడం దీని పని. ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి హైపోథైరాయిడిజం, రెండు హైపర్ థైరాయిడిజం.
హైపోథైరాయిడిజం అనేది పురుషుల కంటే స్త్రీలకి ఎక్కువగా సంక్రమిస్తుంది. అలాగే ఈ సమస్య రావడానికి వయసు పైబడటం కూడా ఒక కారణం అవుతుంది. ఈ హైపోథైరాయిడిజం ప్రారంభ దశలో ముఖ్యమైన సంకేతాలను కలిగి ఉండదు. కానీ దానిని మనం గమనించకపోతే అనేకమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అలసట, సడన్ గా బరువు పెరగటం, సరియైన శ్రమ లేకుండానే శరీరం అలసట పొందడం అలాగే మీ పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలు, ఏ కారణమూ లేకపోయినా మొఖం ఉబ్బిపోవడం, కండరాల బలహీనత,డిప్రెషన్, మలబద్ధకం వంటి లక్షణాలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు హైపోథైరాయిడిజం ఉన్నట్టే.
కాబట్టి వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అదే సమయంలో మీరు కొన్ని ఆహార పదార్థాలను దూరంగా ఉంచవలసిన పరిస్థితి వస్తుంది. వీటిలో ముఖ్యంగా సోయా ఆహారాలు. సోయాలో స్త్రీ హార్మోన్ ఈస్ట్రోజన్ ను కలిగి ఉంటాయి. ఇది మీ శరీరం సింథటిక్ థైరాయిడ్ హార్మోన్ ని గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది.
అలాగే ఆల్కహాల్ తీసుకోవటం కూడా హైపోథైరాయిడిజం ఉన్నవాళ్లకి ప్రమాదం. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం శోషణ స్థాయిలు తగ్గుతాయి మరియు మీ కాలేయం దెబ్బతింటుంది ఫలితంగా థైరాయిడ్ హార్మోన్ల సమస్య పెద్దదవుతుంది.
అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇది శోషణకు ఆటంకం కలిగిస్తుంది మరియు మీ ప్రేగు కదలికలకు కూడా చెడుగా ఉంటుంది. దీనివలన మలబద్ధకం సమస్య ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఆహారాలు జోలికి అసలు పోకండి.