Health Tips: కడుపునిండా తిన్నా బరువు పెరగకూడదంటే.. ఈ ఆహారాలు తినండి!

Health Tips: చాలామంది ఆకలికి తట్టుకోలేరు. అలా అని కడుపునిండా తింటే బరువు పెరిగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఆహారం ఎంతో మంచిది. కడుపునిండా తిన్నప్పటికీ బరువు పెరగరు. ఆ ఆహారాలు ఏమిటో చూద్దాం.
 

 ఆరోగ్యకరమైన బరువుని మెయింటైన్ చేయాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. కడుపునిండా తినాలి కానీ  బరువు పెరగకూడదు అనే వాళ్లకి ఈ ఆహారాలు ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉండేలాగా చూస్తాయి.
 

వాటిలో ముందుగా నట్స్. ఇవి ఎన్ని తిన్నప్పటికీ ఆరోగ్యకరమైన కొవ్వులని ప్రోటీన్ లని కలిగి ఉంటాయి. కనుక వాల్నట్స్, బాదం పప్పులు, వేరుసెనగలు, పిస్తాలు వంటివి రోజుకి రెండు పూటలా తినడం వల్ల శరీరం ఉత్తేజితమవుతుంది. అలాగే పెరుగు కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహారం.
 


ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వెన్న తీసిన పాలతో తయారుచేసిన పెరుగు చాలా మంచిది. అదనపు రుచి కోసం పండ్ల మొక్కలు జత చేయవచ్చు. అలాగే కొమ్ము శనగలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.
 

 వీటిని నానబెట్టి నూనెలో వేయించి ఉప్పు మిరియాల పొడి వేసుకుని ఆకలిగా ఉన్నప్పుడు తినటం వలన ఇనిస్టెంట్గా శక్తి అందుతుంది. అలాగే పీనట్ బట్టర్ ప్రోటీన్లతో నిండి ఉంటుంది. ఇది చాలా శక్తిని ఇస్తుంది అందుకే పిల్లల కోసమే ఈ ఆహారం అనుకోకుండా పెద్దవాళ్ళు కూడా తినవచ్చు.
 

దీనిని తినడం వల్ల ఏమాత్రం బరువు పెరగరు. అలాగే అవకాడో పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికి బరువు పెంచకుండా అవసరమైన క్యాలరీలను ఇస్తుంది. అలాగే పాప్కార్న్ కూడా మంచి టైం పాస్ ఫుడ్. ఇది ఎంత ఎక్కువ తిన్నా కూడా బరువు పెరగరు. ఎందుకంటే దీని ద్వారా అందే క్యాలరీలు చాలా తక్కువ.
 

 ఇది గ్లూటెన్ రహిత చిరు తిండి. అలాగే ఓట్స్ కూడా మన శరీరానికి బరువుని పెంచవు. అలాగే శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లని ఇస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలని పెంచకుండా పొట్టనుండిన ఫీలింగ్ ని ఇవ్వటంలో ఓట్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి.

Latest Videos

click me!