చైనాలోని వుహాన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెందిన ప్రముఖ రచయిత రోజుకి నాలుగు కప్పులు టీ తీసుకోవటం వల్ల టైప్ డయాబెటిస్ ని తగ్గించవచ్చు అని పరిశోధన చేసి మరీ చెప్తున్నారు. ఈ అధ్యాయం ప్రకారం నాలుగు సిప్స్ బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ తాగడం వలన..
టైప్ టు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 8 దేశాలలో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది పెద్దవాళ్లపై చేసిన అధ్యయనంలో ఈ విషయం కనుగొనబడింది.
టీ లోని వివిధ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ క్యారిసినోజనిక్ సమ్మేళనాల కారణంగా టీ ని క్రమం తప్పకుండా తాగటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
రోజుకి ఒక కప్పు టీ మధుమేహం వచ్చే ప్రమాదాన్ని ఒక శాతం తగ్గిస్తుంది. టీ తాగని వాళ్ళతో పోలిస్తే రోజుకి మూడు కప్పుల టీ తాగే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం నాలుగు శాతం తక్కువగా ఉంది. రోజు కనీసం నాలుగు కప్పులు టీ తాగే వారిలో 17% తక్కువ ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడించారు.
భారతదేశంలో 77 మిలియన్ల మందికి మధుమేహం ఉంది. ఇది 2045 నాటికి 134 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. ఐక్యరాజ్యసమితి సర్వే ప్రకారం నీటి తర్వాత ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పానీయం టీ.
బ్లాక్ టీ గ్రీన్ టీ రెండూ కామెల్లియా సినెన్సిస్ ప్లాంట్ నుంచి వస్తాయి. వాటి వాటి పరిస్థితులను బట్టి వాటిని ప్రాసెస్ చేస్తారు. బ్లాక్ టీ ని తక్కువ సమయం పాటు గాలికి బహిర్గతం చేయడం ద్వారా ఆక్సీకరణం చెందుతుంది. గ్రీన్ టీ జాస్మిన్ టీ, బ్లాక్ టీ మరియు ఫ్రూట్, హెర్బల్ టీలు ఇతర దేశాలలో బాగా బాగా ప్రాచుర్యం పొందాయి.