ఒత్తిడిని తగ్గించే సూపర్ ఫుడ్స్.. అవేమిటో తెలుసా?

Navya G   | Asianet News
Published : Dec 26, 2021, 04:20 PM IST

ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ యుగంలో అధిక పని ఒత్తిడి కారణంతో పాటు ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేనప్పుడు ఒత్తిడికి గురవుతాం. శరీరం ఒత్తిడికి (Stress) గురి అయినప్పుడు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక మనం తీసుకునే ఆహార పదార్థాలలో కొన్ని పోషకాలను చేర్చుకోవడం తప్పనిసరి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఇలా ఒత్తిడికి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇప్పుడు మనము ఈ ఆర్టికల్ ద్వారా ఒత్తిడిని తగ్గించే సూపర్ ఫుడ్స్ (Super Foods) గురించి తెలుసుకుందాం..  

PREV
19
ఒత్తిడిని తగ్గించే సూపర్ ఫుడ్స్.. అవేమిటో తెలుసా?

ఆకుకూరలు: ఆకుకూరలలో (Leafy greens) కెరోటినాయిడ్స్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం (Calcium) పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతాయి. కనుక మనం ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది.
 

29

తేనీటితో: గ్రీన్ టీ లలో క్యాలరీలు (Calories) తక్కువగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) నిండుగా ఉండి ఒత్తిడిని దూరం చేస్తాయి. అలాగే మెంతులు సొంటి పొడి యాలకులు వంటి వాటితో  చేసి తేనీరు ఆరోగ్యానికి మంచిది.
 

39

గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజల్లో (Pumpkin seeds) పొటాషియం (Potassium) పుష్కలంగా ఉంటుంది. ఈ గింజల్లో ఉండే పోషకాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. కనుక తరచూ గుమ్మడి గింజలు తీసుకుంటే ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు.
 

49

సోయాబీన్స్: సోయాబీన్స్ (soyabeans) లో రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) ను తగ్గించే పోషకాలు ఉంటాయి. ఇవి వయసు పైబడటంతో వచ్చే మతిమరపును దరిచేరకుండా చూస్తాయి. వీటిని తరచూ ఆహారంలో జీవనశైలిలో అలవరుచుకుంటే ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండవచ్చు.
 

59

వెల్లుల్లి: వెల్లుల్లిలో (Garlic) కాపర్, పొటాషియం, ఐరన్, విటమిన్ బి6, బి 1, పీచుపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. రక్తపోటును (Blood pressure) అదుపులో ఉంచి ఒత్తిడి సమస్యలను దూరం చేస్తుంది. వెల్లుల్లిని రోజు ఏదో ఒక విధంగా ఆహారంలో చేర్చుకోవడం మంచిది.  

69

సిట్రస్‌ ఫలాలు: సీక్రెట్ ఫలాలలో (Citrus fruits) ఉండే విటమిన్‌-సి ఒత్తిడిని ప్రభావితం చేసే హార్మోన్లను (Hormones) నియంత్రిస్తుంది. సిట్రస్ ఫలాలు సానుకూల ఆలోచనలు పెంచుతాయి. వీటిని తరచూ ఆహారంలో తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది.
 

79

గోధుమలు: గోధుమల్లో (Wheat) ఐరన్‌ (Iron) సమృద్ధిగా ఉంటుంది. ఇది మెదడుకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచే ఒత్తిడి ఆందోళనలను దూరం చేస్తుంది. కనుక గోధుమలను ఆహార పదార్థాలు చేయించుకోవడం తప్పనిసరి.
 

89

బొప్పాయి: బొప్పాయిలో (Papaya) కెరోటిన్ (Carotene) ఉంటుంది. ఇది శరీరంలోని విషతుల్యాల్ని బయటకు పంపుతుంది. ఇది మనసును తేలికపరిచి ఒత్తిడి సమస్యలను దూరం చేస్తుంది. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది.
 

99

పాలు: పాలలో (Milk) ల్యాక్టోజ్ (Lactose) ఉంటుంది. ఇది నిద్రలేమి సమస్యలను తగ్గించి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన సమస్యలు దూరం అవుతాయి. కనుక ప్రతిరోజూ పాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

click me!

Recommended Stories