ఇలా స్నానం చేస్తున్నారా అయితే ఏం జరుగుతుందో చూడండి?

First Published Dec 26, 2021, 1:48 PM IST

పురాణాల ప్రకారం స్నానానికంటూ కొన్ని ప్రత్యేకమైన నియమాలంటూ ఉన్నాయి. వాటిని అనుసరిస్తే ఆరోగ్యంతో (Health) పాటు అష్టైశ్వర్యాలు, సానుకూలమైన ప్రతిఫలాలను పొందగలుగుతాము. మన జీవితంలో ఎదుర్కొనే అనారోగ్య సమస్యలకు, ఆర్థిక నష్టాలకు, సంతాన ఇబ్బందులకు మనం అనుసరించే స్నానం పద్ధతులు కూడా కొంత ప్రభావాన్ని చూపుతాయి. అయితే స్నానం చేసే సమయంలో పాటించవలసిన నియమాలు (Rules to follow) గురించి తెలుసుకుందాం..
 

స్నానం ఎప్పుడూ కూడా సూర్యోదయానికి (Sunrise) ముందే  చేయాలి. లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే సూర్యోదయానికి లోపే స్నానం చేయాలి. ఇలా సూర్యోదయానికి ముందుగా స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం (Lakshmidevi grace) మన మీద ఉంటుంది. ఉదయం ఆలస్యంగా స్నానం చేస్తే అది రాక్షస స్నానం అంటారు. అయితే వృద్ధులకు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ నియమాలు వర్తించవు. వారు ఆలస్యంగా స్నానం చేయవచ్చు.

ఇంటిలోని మగవారు రోజు తల స్నానం (Head bath) చేయాలి. స్త్రీలు వారానికి ఒక్కరోజే తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మొదటి చెంబు పోసుకునే సమయంలో ఒక మంత్రాన్ని చదివితే అన్ని నదుల్లో నీళ్లు పోసుకున్న పుణ్యఫలితం లభిస్తుంది. స్నానం చేసే సమయంలో పాటించవలసిన మంత్రం (Mantram): గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు.

తిన్నా వెంటనే స్నానం చేయరాదు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు (Illness issues) ఏర్పడతాయి. కొంత సమయం తరువాత స్నానం చేయడం మంచిది. స్నానం చేసేటప్పుడు మగవారు ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయరాదు. ఇలా చేస్తే జలధి దేవతకు ఆగ్రహం కలుగుతుంది. ఇలా చేస్తే సంతానం ఉండదు. కనుక ఒంటి మీద టవల్ అయినా కట్టుకొని స్నానం చేయాలి. వంశాభివృద్ధి జరగాలంటే పురుషులు ఎప్పుడూ నగ్నంగా (Naked) స్నానం చేయకూడదు.
 

స్నానం చేసిన తర్వాత ఒళ్ళు రుద్దుకున్న తడి పొడి టవల్ (Wet dry towel) ని మరలా నడుముకు కట్టుకొరాదు. ఇలా చేస్తే వంశాభివృద్ధి జరగదు. సంతానం (Offspring) కలగదు. ఒకవేళ సంతానం కలిగిన చదువు అబ్బదు, చెప్పిన మాట వినరు, పెద్దలను ఎదిరించి మాట్లాడతారు. కనుక స్నానం చేసిన తరువాత ఒళ్ళును తుడుచుకున్న టవల్ ను నీళ్ళల్లో పూర్తిగా తడిపి పిండి తర్వాత నడుముకు కట్టుకోవాలి. 
 

స్నానం చేసే సమయంలో నడుముకు కట్టుకున్న టవల్ ను పైన నుంచే తీయాలి. నడుముకు కట్టుకున్న టవల్ ను కిందికి జారి విడిస్తే అది అశుభానికి (Unfortunately) సూచిక. వారానికి ఒక్కసారి అయినా ఉప్పును నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తే ఐశ్వర్యం, పాజిటివ్ ఎనర్జీ (Positive energy) వస్తుంది. స్నానం చేసేటప్పుడు నగ్నంగా స్నానం చేయరాదు. ఒంటి మీద ఒక బట్ట అయినా ఉండాలి. గులాబీ రేకులను నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే చర్మ ఆరోగ్యంతో పాటు ఆలోచన విధానం కూడా మారుతుంది. స్నానం నిలబడి చేయరాదు ఇది ఆశుభకార్యాలలో మాత్రమే జరుగుతుంది. కనుక కూర్చుని స్నానం చేయాలి.

click me!