గుండె ఆరోగ్యానికి ఈ మార్పులు తప్పనిసరి..!

First Published Dec 25, 2021, 4:15 PM IST

వ్యాయామం అంటే.. రోజూ జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయాల్సిన పనిలేదు. కానీ.. కనీసం 20 నిమిషాలు నడవడం, యోగా, చిన్న పాటి వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

heart


మన శరీరంలో గుండె అతి ముఖ్యమైన అవయవం.  గుండె పనిచేస్తున్నంత సేపు మాత్రమే.. మనం ఆరోగ్యంగా ఉండగలం. గుండె కొట్టుకోవడం ఆగిపోయిన నిమిషమే.. మన ప్రాణం కూడా గాలిలో కలిసిపోతుంది. అంతటి ముఖ్యమైన గుండెను కొందరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొందరు తెలిసి మరీ నిర్లక్యం చేస్తుంటే.. కొందరు తెలియక.. పొరపాటుగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.

తెలిసీ తెలియక మనం చేసే కొన్ని నిర్షక్ష్యాలు.. మన అలవాట్ల కారణంగా కూడా గుండెకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి అలవాట్లు.. మన గుండెకు ముప్పు తెస్తున్నాయో.. ఎలాంటి అలవాట్లను విడిచిపెడితే.. మన గుండె పదిలంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మనిషి ఆరోగ్యంగా ఉండటానికి.. ఆరోగ్యకరమైన బరువు కూడా చాలా ముఖ్యం. మనలో చాలా మంది ఆహారం తీసుకున్నా కూడా... నీరసం పట్టి పీడిస్తోందని.. చాలా ఆందోళనగా ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే.. మనం అలా యాక్టివ్ గా లేకపోవడానికి కారణాలు ఉంటాయి. ప్రతిరోజూ వ్యాయామాలు చేయకపోవడం.. బద్దకంగా నిద్రపోవడం లాంటివి చేసేవారిలో.. ఈ సమస్యలు మొదలౌతూ ఉంటాయి. 

దీంతో.. గుండె ఆరోగ్యం తగ్గిపోతుంది. కాబట్టి.. గుండె ఆరోగ్యంగా ఉండటానికి.. ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ చిన్నపాటి వ్యాయామాలు అయినా చేయాలని సూచిస్తున్నారు. వ్యాయామం అంటే.. రోజూ జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయాల్సిన పనిలేదు. కానీ.. కనీసం 20 నిమిషాలు నడవడం, యోగా, చిన్న పాటి వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

పొగతాగే అలవాటు ఉంటే.. వారే స్వయంగా తమ గుండెను నాశనం చేసుకుంటున్నవారు అవుతారు. పొగ మనిషిని చంపేస్తుంది. ఈ అలవాటు కనుక మీకు ఉంటే.. వెంటనే ఆ అలవాటు మార్చుకోవాలి. ప్రపంచంలో గుండెపోటుతో మరణించేవారిలో..మూడింట ఒక వంతు.. ఈ స్మోకింగే కారణమౌతోందట. కాబట్టి.. ఈ అలవాటు మార్చుకుంటే.. గుండె పదిలంగా మార్చుకోవచ్చు.

tension

మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ఒత్తిడి పెంచుకోవద్దు. ఒత్తిడి.. మనకు కనపడని శత్రువు. ఒత్తిడి కారణంగా... గుండె పనితీరు నెమ్మదౌతుంది. ఒత్తిడి తట్టుకోలేక.. గుండె నొప్పితో చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అధిక ఒత్తిడి గుండెపై ఒత్తిడి తెచ్చి, కొలెస్ట్రాల్ స్థాయికి దారి తీస్తుంది. ఇది ధమనుల నష్టానికి దారితీస్తుంది మరియు గుండెపోటు ప్రమాదాన్ని అనేక రెట్లు పెంచుతుంది. ఒత్తిడిని ఎదుర్కోవటానికి, ప్రజలు తాగడం, పొగ త్రాగడం , అతిగా తినడం, ఇవన్నీ గుండెకు మరింత హాని కలిగిస్తాయి. ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడానికి, మీరు వ్యాయామం చేయాలి, ఇది శరీరాన్ని ఉపశమనం చేస్తుంది. హార్మోన్లను నియంత్రిస్తుంది, తద్వారా గుండెకు సహాయపడుతుంది. ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడానికి ఇతర మార్గాలలో ధ్యానం, సంగీతం వినడం,కుటుంబం లేదా పెంపుడు జంతువులతో గడపడం వంటివి ఉన్నాయి.

ఇక ఈ రోజుల్లో జంక్ ఫుడ్ అలవాటు లేనివారు లేరనే చెప్పాలి. కొందరు.. ఎలాంటి వ్యాయామం లేకుండా.. వీటిని లాగిస్తుంటే.. కొందరు.. వారమంతా వ్యాయామం చేసి.. వారంతాల్లో వీటిని తింటారు. ఈ రెండూ ప్రమాదకరమే అని నిపుణులు చెబుతున్నారు. ఈ జంక్ ఫుడ్స్ లో కొలిస్ట్రాల్ స్టాయి ఎక్కువగా ఉ:టాయి. వీటిలొ పోషక విలువలు తక్కువగా ఉండి.. ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రజలలో గుండెపోటుకు కారణమయ్యే ప్రధాన కారకాల్లో ఆల్కహాల్ ఒకటి. ఇది శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని ప్రేరేపిస్తుంది, ఇది కొవ్వు అనారోగ్య రూపం, ఇది అధిక నష్టం కలిగిస్తుంది. దీని వల్ల . బరువు పెరగడానికి కారణమౌతుంది. కాబట్టి.. దీనిని మానేయాలి. పూర్తిగా మానేయలేకపోతే.. మితంగా తీసుకోవాలి. మితంగా పానీయాలు తీసుకోవడం చాలా ముఖ్యం . మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దాని పర్యవసానాలను తగ్గించడానికి వ్యాయామం చేయడం చాలా అవసరం.

click me!