విటమిన్ డి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
విటమిన్ డి ఎముకల ఆరోగ్యం, కండరాల బలం, క్యాన్సర్, గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం, రోగనిరోధక పనితీరును మెరుగుపరచడం, అకాల మరణ ప్రమాదాన్ని తగ్గించడం వంటి అనేక ఆరోగ్య పరిస్థితులతో ముడిపడి ఉంది.
అనేక పరిశీలనా అధ్యయనాలు మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను నియంత్రించడంలో విటమిన్ D కీలక పాత్ర పోషిస్తుందట. ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో నూ విటమిన్ డీ ది ముఖ్యపాత్ర.
పెద్దప్రేగు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ల వంటి కొన్ని రకాల క్యాన్సర్‌లను నియంత్రించడంలో విటమిన్ డి ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.