Social Media: ప్ర‌తీది వాట్సాప్ స్టేట‌స్ పెట్టే వారికి ఏమైనా సమస్యా.? సైకాల‌జీ ఏం చెబుతోందంటే

Published : Jan 01, 2026, 10:51 AM IST

Social Media: స్మార్ట్‌ఫోన్ వినియోగం పెర‌గ‌డం, ప్ర‌తీ ఒక్క‌రికీ డేటా ఛార్జీలు అందుబాటులోకి రావ‌డంతో సోష‌ల్ మీడియా వాడకం ఎక్కువైంది. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అయితే సైకాల‌జీ ప్ర‌కారం ఇలాంటి వారి ఆలోచ‌న ఎలా ఉంటుందంటే.. 

PREV
15
వాట్సాప్ స్టేటస్‌లు ఎందుకు పెడుతున్నారు?

ఇటీవలి కాలంలో వాట్సాప్ స్టేటస్ ఒక అలవాటుగా మారింది. చిన్న విషయం జరిగినా సరే వెంటనే స్టేటస్‌లో పెట్టేస్తున్నారు. ఈ ప్రవర్తన వెనక ఉన్న మానసిక కారణాలు చాలామందికి తెలియవు. ఇప్పుడు ఆ కోణంలో స్పష్టంగా చూద్దాం.

25
ప్ర‌తీ విష‌యాన్ని స్టేటస్‌లో పెట్టే అలవాటు ఎలా మొదలైంది?

సోషల్ మీడియా పెరిగిన తర్వాత మనుషుల జీవితం పబ్లిక్‌గా మారింది. సంతోషం వచ్చినా, బాధ కలిగినా దాన్ని లోపలే ఉంచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇతరులు చూస్తున్నారు అన్న భావనే కొందరికి ఊరట ఇస్తోంది. ఈ అలవాటు క్రమంగా అవసరంగా మారుతోంది.

35
ఒక్కరికి చెప్పాలి అన్న కోరికతో స్టేటస్‌లు

చాలా స్టేటస్‌లకు అసలు ఉద్దేశం అందరికీ చెప్పడం కాదు. ఒక ప్రత్యేక వ్యక్తి చూడాలి, అర్థం చేసుకోవాలి అన్న కోరిక ఉంటుంది. నేరుగా మెసేజ్ చేయలేని భావాన్ని స్టేటస్ రూపంలో చెప్పే ప్రయత్నం ఇది. ఇది “ఇండైరెక్ట్ కమ్యూనికేషన్”గా సైకాలజీ చెబుతుంది.

45
గుర్తింపు కావాలన్న అవసరం

స్టేటస్‌కు వ్యూస్ వస్తున్నాయా, రిప్లై వచ్చిందా అన్నదే కొందరికి ముఖ్యంగా మారింది. ఇది Validation Seeking Behavior అనే మానసిక ధోరణిగా చెబుతారు. ఎవరైనా స్పందిస్తే “నన్ను గమనిస్తున్నారు” అన్న భావన కలుగుతుంది. అదే ఆనందం ఇస్తుంది.

55
సైకాలజీ ఏం చెబుతోంది?

ఇలాంటి ప్రవర్తనను సైకాలజీలో ఎమోష‌న‌ల్ డిపెండెన్సీ ఆన్ సోష‌ల్ మీడియా, అటెన్ష‌న్ సీకింగ్ ప్యాట‌ర్న్‌, ఫియ‌ర్ ఆఫ్ బీయింగ్ ఇగ్నోర్డ్ అని పిలుస్తారు. లోపల ఒంటరితనం, అసంతృప్తి, భావాలను పంచుకునే వ్యక్తి లేకపోవడం ప్రధాన కారణాలుగా చెబుతుంటారు. స్టేటస్ ఆ ఖాళీని తాత్కాలికంగా నింపుతుంది.

ఇది సమస్యా? లేక సహజమైన అలవాటా?

అప్పుడప్పుడు స్టేటస్ పెట్టడం సమస్య కాదు. కానీ ప్రతి భావాన్ని స్టేటస్ ద్వారానే చెప్పాలి అన్న స్థితి వస్తే జాగ్రత్త అవసరం. నిజమైన సంభాషణ తగ్గి, వర్చువల్ స్పందనపై ఆధారపడటం మొదలైతే అది మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. సంతోషం, బాధ రెండింటికీ స్క్రీన్ మాత్ర‌మే ప‌రిష్కారం కాదు. నిజమైన మనుషులే అసలైన పరిష్కారం. అని గుర్తించాలి.

Read more Photos on
click me!

Recommended Stories