ఈ మధ్యకాలలో వృద్ధులకు ఇప్పటికే మధుమేహం ,హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంది, కాబట్టి రాత్రిపూట కాంతికి గురికావడం వల్లే.. ఈ సమస్య వస్తుందో లేదో అనే విషయాన్ని పరిశోధనలో చెక్ చేశారట. అధ్యయనంలో పాల్గొన్న 552 మందిలో సగం కంటే తక్కువ మంది రోజుకు ఐదు గంటల పూర్తి చీకటిని కలిగి ఉన్నారని అధ్యయన పరిశోధకులు ఆశ్చర్యపోయారు. మిగిలిన పాల్గొనేవారు రోజులోని వారి చీకటి ఐదు గంటల వ్యవధిలో కూడా ఎంతోకొంత కాంతి వారికి తగులుతుందట.