శరీరానికి మెగ్నీషియం ఎంత అవసరం.. ఇది లోపించిందని తెలిపే సంకేతలు ఏంటి?

Published : Jun 23, 2022, 03:16 PM IST

మన రోజువారీ జీవితంలో మెగ్నీషియం (Magnesium) కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో సుమారు మూడు వందల రకాలకు పైగా జరిగే రసాయనిక చర్యల్లో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది.  

PREV
18
శరీరానికి మెగ్నీషియం ఎంత అవసరం.. ఇది లోపించిందని తెలిపే సంకేతలు ఏంటి?

అందుకే మెగ్నీషియం కలిగిన ఆహార పదార్థాలను ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి (Health) ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు. శరీరంలో మెగ్నీషియం లోపం తలెత్తితే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

28

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు మెగ్నీషియం సహాయపడుతుంది. మెగ్నీషియం గుండె సక్రమంగా కొట్టుకోవడం (Heart palpitations) నుండి కండరాలు, హార్మోనుల పనితీరు (Function of hormones) వరకు కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో మెగ్నీషియం తగిన మోతాదులో ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. మగవారికి కనీసం రోజుకు 350 మిల్లీగ్రాములు, అదే మహిళలకైతే 300 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది.

38

కానీ ప్రస్తుత కాలంలో కనీసం అందులో సగం పరిమాణంలో కూడా మెగ్నీషియం తీసుకోవడం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా శరీరంలో తగిన మోతాదులో మెగ్నీషియం లేకపోవడం కారణంగా ప్రతి ఏటా చాలామంది అనేక అనారోగ్య సమస్యలను (Illness issues) ఎదుర్కొంటున్నారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి కణానికి (Cell) మెగ్నీషియం తప్పనిసరి.

48

మెగ్నీషియం లోపిస్తే పళ్ళు పాడవడం, ఎముకలు బలహీనపడటం, శరీరంలో వణుకు, కండరాలు బలహీనపడటంతో పాటు గుండె కొట్టుకోవడంలో మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం లోపిస్తే (Magnesium deficiency) శరీరంలోని వందలాది ఎంజైమ్ ల పనితీరు దెబ్బతింటుంది. అలాగే విటమిన్ బి6 (Vitamin B6) శోషణ జరగాలంటే శరీరంలో సమపాళ్లలో మెగ్నీషియం ఉండాలి.

58

శరీరంలోని బ్లడ్ షుగర్ ను శక్తిగా మార్చగల సామర్థ్యం మెగ్నీషియంకు ఉంటుంది. ఇది మూత్రపిండాలు, జీర్ణకోశంలో రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా జీర్ణశక్తిని పెంచి జీర్ణ సంబంధిత వ్యాధులు (Gastrointestinal diseases), మలబద్ధకం (Constipation) వంటి సమస్యలను తగ్గిస్తుంది. మెదడు పనితీరు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు కూడా మెగ్నీషియం సహాయపడుతుంది. 

68

ఇది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించి నిద్ర బాగా పట్టేందుకు సహాయపడుతుంది. మూత్ర సంబంధిత వ్యాధులు (Urinary tract diseases), వాంతులు అవడం, డయేరియా (Diarrhea) బారినపడటం ఇలా అనేక రకాల సమస్యలు తలెత్తితే మెగ్నీషియం లోపంగా గుర్తించాలి. ఈ సమస్యలన్నింటికీ దూరంగా ఉండాలంటే వైద్యుల సలహా మేరకు మెగ్నీషియం సప్లిమెంట్స్ లను తీసుకోవచ్చు.
 

78

కాకపోతే వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే గుండెకు ప్రమాదం (Risk to heart) కలిగే అవకాశం ఉంటుంది. కనుక మెగ్నీషియం ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను రోజువారి జీవితంలో అలవరుచుకోవడం మంచిదని వైద్యులు అంటున్నారు. కనుక ఆకుకూరలు, గింజలు, తృణధాన్యాలు (Cereals), పెరుగు, చేపలు, అరటి పండ్లు వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరానికి కావలసిన మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది.
 

88

కాబట్టి ఈ ఆహార పదార్థాలను తీసుకుంటూ కాఫీ, ఆల్కహాల్ (Alcohol), సోడా, కూల్ డ్రింక్స్ (Cool Drinks) వంటి వాటికి దూరంగా ఉంటే మెగ్నీషియం లోపం ఏర్పడదు. కాబట్టి తీసుకునే ఆహార జీవనశైలి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మెగ్నీషియం కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories