ఆలివ్ ఆయిల్ తో స్కిన్ కేర్.. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?

Published : May 26, 2022, 02:23 PM IST

చర్మ సౌందర్యం (Skin beauty) కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారా! అయినా మీరు ఆశించిన ఫలితం లభించడం లేదా!  

PREV
19
ఆలివ్ ఆయిల్ తో స్కిన్ కేర్.. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?

ఈసారి ఆలివ్ ఆయిల్ (Olive oil) ను ఉపయోగించండి.. ఈ ఆయిల్ మీ చర్మ సమస్యను తగ్గించి చర్మ సౌందర్యాన్ని మరింత రెట్టింపు చేస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఆయిల్ ను ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

29

ఈ ఆయిల్ లో అనేక విటమిన్లు, మినరల్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మానికి తగినంత తేమను అందించి చర్మ సంరక్షణలోనూ (Skin care), జుట్టు సంరక్షణలో (Hair care) ఎంతో ఉపయోగపడతాయి. దీంతో చర్మ సమస్యలన్ని తగ్గి కాంతివంతమైన మెరిసే చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది.
 

39

మృదువైన చర్మ సౌందర్యం కోసం: ఆలివ్ ఆయిల్ (Olive oil) లో కొద్దిగా నిమ్మరసం (Lemon juice) కలిపి ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మానికి తగిన తేమ అంది పొడి చర్మ సమస్యలు తగ్గి చర్మం మృదువుగా మారుతుంది.
 

49

మృతకణాలు తొలగిపోతాయి: ఆలివ్ ఆయిల్ (Olive oil) కు కొద్దిగా పాలమీగడను (Milk cream) కలుపుకొని ఆ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా అప్లై చేసుకోవాలి. పదినిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.
 

59

కాంతివంతమైన చర్మ కోసం: స్నానం చేసే నీటిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను కలుపుకుని ఆ నీటితో స్నానం చేస్తే చర్మ రంధ్రాలలో (Skin pores) పేరుకుపోయే మురికి (Dirty) తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. దీంతో చర్మం తాజాగా ఉండి కాంతివంతమైన చర్మ సౌందర్యం మీకు లభిస్తుంది. 
 

69
olive oil

పాదాల పగుళ్లు తగ్గుతాయి: ముఖ సౌందర్యంతో పాటు పాదాల సౌందర్యం కూడా ముఖ్యమే. కనుక ఆలివ్ ఆయిల్ (Olive oil) లో కొద్దిగా పసుపును (Turmeric) కలుపుకుని పాదాల పగుళ్లకు అప్లై చేసుకుంటే అక్కడి చర్మ సమస్యలు తగ్గి పాదాల పగుళ్లు తగ్గుతాయి.
 

79
olive oil

వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి: ఆలివ్ ఆయిల్ (Olive oil) లో కొద్దిగా తేనెను (Honey) కలుపుకొని ముఖానికి సున్నితంగా అప్లై చేసుకొని, పది నిమిషాల తరువాత ముఖాన్ని సున్నిపిండితో రుద్దుకుని శుభ్రపరచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.

89
olive oil

పెదాల పగుళ్లను తగ్గిస్తుంది: ఆలివ్ ఆయిల్ లో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ఆ మిశ్రమాన్ని పెదాలకు రాసుకోవాలి. పదినిమిషాల తరువాత  నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం పెదాలకు మాయిశ్చరైజర్ (Moisturizer) గా సహాయపడి తగినంత తేమను అందించి పెదాల పగుళ్లను (Cracked lips) తగ్గిస్తుంది. 
 

99
olive oil

జుట్టు పొడిబారే సమస్యలు తగ్గుతాయి: ఆలివ్ ఆయిల్ (Olive oil), కొబ్బరి నూనె (Coconut oil), ఆముదం నూనెను (Castor oil) సమపాళ్లలో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ నూనెను జుట్టుకు బాగా అప్లై చేసుకుని ఒక గంట తరువాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు పొడిబారే సమస్యలు తగ్గుతాయి.

click me!

Recommended Stories