ఈ ఆహార పదార్థాలను కలిపి తింటున్నారా.. అయితే మీరు మృత్యువుకు చేరువలో ఉన్నట్టే!

Published : May 25, 2022, 04:16 PM IST

నోటికి రుచి అందించడం కోసం తినే ఆహారంలో కొన్ని పదార్థాలను కలిపి తీసుకుంటూ ఉంటాం. కానీ రుచి కోసం ఆలోచిస్తే మనమే అనేక అనారోగ్య సమస్యలను (Illness issues) కోరి తెచ్చుకున్నట్టే.  

PREV
18
ఈ ఆహార పదార్థాలను కలిపి తింటున్నారా.. అయితే మీరు మృత్యువుకు చేరువలో ఉన్నట్టే!

తీసుకునే ఆహారం శరీరానికి మంచిగా లేదా అని ఆలోచించాలి. అలా మనం తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ చూపకుండా అనాలోచితంగా కొన్ని పదార్థాలను కలిపి తీసుకుంటే మృత్యువుకు (Death) చేరువలో ఉన్నట్టే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి కలిపి తినకూడని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

28

ఆకుకూరలు, పాలు: ఆకుకూరలను (Leafy greens) వండేటప్పుడు రుచికోసం పాలు (Milk) పోసి వండుతుంటారు. అయితే పాలకు ఉప్పు తగలడంతో పాలు విరిగి పోయి కూరకు రుచి వస్తుంది. కానీ ఈ కూరలను తింటే శరీరంలోని రక్తానికి అందవలసిన ఆక్సిజన్ మలినంగా మారి శరీరంలో చెడు రక్తం పెరుగుతుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 

38

అరటిపండు, పెరుగు: చాలామంది పెరుగన్నంలో అరటిపండు కలుపుకుని తినడానికి ఇష్టపడతారు. రసాయన చర్యలకు లోనయ్యి    పెరుగుగా (Yogurt) మారిన పదార్థంలో అరటిపండును (Banana) కలుపుకొని తినడంతో అది జీర్ణాశయంలో పులిసిపోయి ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. దీంతో ఉదర ఆరోగ్యం దెబ్బతింటుంది
 

48

పాలు, చేపలు: చేపలకూర వండేటప్పుడు రుచి కోసం చాలామంది పాలను వాడుతుంటారు. అయితే పాలు (Milk), చేపలను (Fish) రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణాశయపు గోడలు దెబ్బతింటాయి. అలాగే ముఖ్యంగా చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసి కుష్టు వ్యాధికి దారితీస్తుంది. కనుక పొరపాటున కూడా ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోరాదు.
 

58

తేనె, నెయ్యి: తేనె (Honey), నెయ్యి (Ghee) రెండు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి రెండూ ఆరోగ్యానికి మంచివే కానీ ఈ రెండింటిని సమాన మోతాదులో కలిపి తీసుకుంటే వాటి మధ్య జరిగే రసాయన చర్య కారణంగా ఇది స్లో పాయిజన్ గా మారుతుంది. కనుక చాలా మంది రెండింటిని సమభాగాలుగా తీసుకోరు. ఒకటి ఎక్కువ మరొకటి తక్కువగా ఉపయోగిస్తారు.
 

68

పాలు, పండ్లు: పాలలో (Milk) ఉండే కొవ్వులు, పండ్లలో (Fruits) ఉండే చక్కెరలతో కలిసి రసాయన చర్య జరగడంతో ముక్కు, చెవి, గొంతు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ సమస్యలు అప్పటికప్పుడు రాకపోయినా వీటి ప్రభావం నిదానంగా ఉంటుంది. కనుక వీటిని కలిపి తీసుకోవడం మంచిది కాదని వైద్యులు అంటున్నారు.
 

78

పెరుగు, మాంసం: చాలామంది మాంసం (Meat) వండేటప్పుడు రుచి కోసం పెరుగును (Yogurt) ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే నోటి రుచి కోసం ఆలోచిస్తే ఆరోగ్యానికి ప్రమాదం. ఇలా పెరుగు, మాంసం కలిపి తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు శాతం పెరిగిపోతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
 

88

పైన చెప్పిన పదార్థాలను కలిపి తీసుకుంటే వాటి ప్రభావం శరీరంపై తొందరగా చూపించకపోయినా నిదానంగా శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి (Damage health). కనుక ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. తీసుకునే ఆహారం శరీరానికి మంచిదా కాదా అని ఆలోచించి తీసుకుంటే మన జీవన కాలాన్ని (Life span) పెంచుకోవచ్చు.

click me!

Recommended Stories